Breaking News

రోజుకు 12 గంటల నిద్ర!.. ఇదే నా సక్సెస్ సీక్రెట్

Published on Tue, 10/07/2025 - 16:27

స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తుందని.. అందరూ నమ్ముతుంటే, ఫోన్ వాడకపోవడం వల్లే నేను సక్సెస్ సాధించా అని టెలిగ్రామ్ కో-ఫౌండర్, సీఈఓ పావెల్ దురోవ్ (Pavel Durov) చెబుతున్నారు. ఇంతకీ అదెలా సాధ్యమైంది?, వివరాలు ఏమిటనేది ఇక్కడ తెలుసుకుందాం.

లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ''రోజులో వీలైనంత సమయం.. సుమారు 11 నుంచి 12 గంటలు నిద్ర కోసం కేటాయించడానికి ప్రయత్నిస్తాను. అయితే అన్ని గంటలు నిద్రకోసం కేటాయించినా.. నిద్రపోను. మంచం మీద పడుకుని ఆలోచిస్తూనే ఉంటాను'' అని దురోవ్ పేర్కొన్నారు.

పడుకున్నప్పుడే.. నాకు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. తాను సోషల్ నెట్‌వర్కింగ్‌లో ఉన్నప్పటికీ.. స్మార్ట్‌ఫోన్ వాడకం చాలా తక్కువని పేర్కొన్నారు. నిద్ర లేచిన వెంటనే తన ఫోన్‌ చూడకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను. నోటిఫికేషన్‌లు, సోషల్ మీడియా వంటివన్నీ ఒక వ్యక్తి రోజును డిసైడ్ చేస్తాయని నమ్ముతాను.

జీవితంలో ఏది ముఖ్యమైనదో నిర్ణయించుకోవాలి. ఇతర వ్యక్తులు, కంపెనీ వంటివన్నీ మన జీవితంలో చాలా ముఖ్యమైనవి కాదు. ప్రతి రోజూ ఉదయం ఫోన్ లేకుండానే మీ దినచర్యను ప్రారభించడం అలవాటు చేసుకోవాలి.

ఇదీ చదవండి: ఉద్యోగం కోసం డిగ్రీ సరిపోదు!: లింక్డ్ఇన్ సీఈఓ కీలక వ్యాఖ్యలు

వ్యాయామం చేసేటప్పుడు.. ఇతరత్రా పనులు చేసేటప్పుడు కూడా వీలైనంత ఫోనుకు దూరంగా ఉండాలి. ఫోన్ దూరంగా ఉన్నప్పుడే మీకు అద్భుతమైన ఆలోచనలు రావొచ్చని దురోవ్  చెబుతున్నారు. టెక్నాలజీ, కనెక్టివిటీ వంటి వాటికి మద్దతు ఇస్తున్నప్పటికీ.. జీవితంలో ఏది ముఖ్యమో దానికోసం సమయం వెచ్చించాలని ఆయన సూచించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)