Breaking News

వేగంగా టెలికాం సేవల పునరుద్ధరణ

Published on Wed, 09/04/2024 - 12:24

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వరదలతో టెలికాం సేవల్లో అంతరాయం ఏర్పడింది. గడిచిన 24 గంటల నుంచి వర్షాలు కాస్త నెమ్మదించడంతో టెలికాం కంపెనీలు తమ సేవల పునరుద్ధరణపై దృష్టి సారించాయి. అందులో భాగంగా ప్రముఖ టెలికాం సేవల సంస్థ జియో తెలుగు రాష్ట్రాల్లో వేగంగా సేవలను పునరుద్ధరించింది. వరదల వల్ల దెబ్బతిన్న టెలికాం నెట్‌వర్క్‌ను మెరుగ్గా నిర్వహించేలా క్షేత్ర స్థాయిలో సిబ్బందిని రంగంలోకి దించింది. వరద ఉధృతి పూర్తిగా తగ్గకముందే తిరిగి జియో తన సేవలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంది.

రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తన నెట్‌వర్క్‌ను మెరుగుపరచడానికి గణనీయమైన పెట్టుబడులు పెట్టింది. ఇప్పటికే రూ.6,500 కోట్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లో 5జీ సేవలను ప్రారంభించింది. ముందుగా తిరుమల, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. క్రమంగా ఈ సర్వీసును విస్తరిస్తున్నారు. తెలంగాణలోనూ జియో 5జీ సేవలు అందిస్తోంది. దేశం అంతటా హై-స్పీడ్ ఇంటర్నెట్, మెరుగైన కనెక్టివిటీని అందించడానికి జియో చర్యలు తీసుకుంటుంది.

ఇదీ చదవండి: పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్‌ పనితీరుపై లేఖ

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)