Breaking News

సిగ్నెల్ రాకుంటే యూజర్లకు పరిహారం!.. ట్రాయ్ కొత్త రూల్స్

Published on Thu, 08/08/2024 - 07:36

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నిబంధనలను ప్రకటించింది. టెలికామ్ సేవల్లో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి, నిబంధనలను మరింత కఠినతరం చేసినట్లు వెల్లడించింది. ఈ అంశంపైన క్షుణ్ణంగా పరిశీలనలు జరిపిన తరువాత కొత్త రూల్స్ జారీ చేయడం జరిగిందని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరమ్ ఈవెంట్‌లో.. ట్రాయ్ చైర్మన్ 'అనిల్ కుమార్ లాహోటి' తెలిపారు.

ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం.. సిగ్నెల్స్ రాకుంటే యూజర్లకు పరిహారం చెల్లించాలి. సర్వీస్ ప్రొవైడర్లు తమ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలని అథారిటీ వెల్లడించింది. దీనికి ఆరు నెలల గడువు కూడా ఇచ్చింది. కొత్త అప్‌గ్రేడ్స్ ద్వారా వినియోగదారులకు సరైన క్వాలిటీ సర్వీస్ లభిస్తుంది. నిబంధలనలను ఉల్లంఘించిన సంస్థలకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని అనిల్ కుమార్ లాహోటి పేర్కొన్నారు.

ట్రాయ్ జారీ చేసిన కొత్త క్వాలిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం, జిల్లా స్థాయిలో 24 గంటల కంటే ఎక్కువ సమయం సర్వీస్ ఆగిపోయినప్పుడు టెలికామ్ ఆపరేటర్లు చందాదారులకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ జరిమానా మొత్తాన్ని రూ. 50వేలు నుంచి రూ.1 లక్షకు పెంచారు.

ఇదీ చదవండి: పెట్రోల్ అవసరం లేని వాహనాలు వచ్చేస్తున్నాయి: నితిన్ గడ్కరీ

గ్రేడెడ్ పెనాల్టీ విధానం ఆధారంగా జరిమానా రూ.1 లక్ష,  రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షలుగా విభజించారు. ది స్టాండర్డ్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ యాక్సెస్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ రెగ్యులేషన్స్ చట్టం ప్రకారం ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. ఈ కొత్త రూల్స్‌పై టెలికామ్ ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)