Breaking News

హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో మరో కొత్త సదుపాయం

Published on Tue, 11/25/2025 - 16:48

హైదరాబాద్: నగరంలోని జీనోమ్ వ్యాలీ ఇన్నోవేషన్ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం మరింత విస్తరించింది. భారతదేశంలోనే తొలి సింగిల్-యూజ్ బయోప్రాసెస్ డిజైన్ అండ్‌ స్కేల్-అప్ సదుపాయం తెలంగాణ వన్‌ బయో (1 BIO)ను ప్రారంభించింది. దేశ బయోలాజిక్స్, తదుపరి తరం చికిత్సా సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో ఇదిఒక పరివర్తనాత్మక దశను సూచిస్తుంది.

భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (డీబిటీ), తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టిజిఐఐసి) సహకారంతో తెలంగాణ లైఫ్‌సైన్సెస్ నేపథ్యంతో వన్‌ బయోను జీనోమ్ వ్యాలీలోని 2 ఎకరాల క్యాంపస్‌లో తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ఫార్చ్యూన్ 500 గ్లోబల్ లీడర్ అయిన థర్మో ఫిషర్ సైంటిఫిక్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ బయోప్రాసెస్ డిజైన్ సెంటర్, భారత్‌తోపాటు పెరుగుతున్న ప్రపంచ బయోలాజిక్స్ పైప్‌లైన్‌కు అవసరమైన తదుపరి తరం సామర్థ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో జీఎల్‌పీ, జీఎంపీ గ్రేడ్ బయోమోలిక్యూల్ అభివృద్ధిలో తెలంగాణను ముందంజలో ఉంచుతుంది.

జీనోమ్ వ్యాలీ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు కొత్త జీనోమ్ వ్యాలీ లోగోను ఆవిష్కరించారు. రాష్ట్ర రహదారి వెంబడి జీనోమ్ వ్యాలీ ప్రవేశద్వారం వద్ద నిర్మించబోయే ల్యాండ్‌మార్క్ గేట్‌వే డిజైన్‌ను సైతం మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జీనోమ్ వ్యాలీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో, దాని తదుపరి 25 సంవత్సరాలకు మార్గాన్ని నిర్దేశిస్తున్నాము. బయోలాజిక్స్ విస్తరణ అవకాశాలను మరింత మెరుగుపరచడం వైపు భారతదేశ అత్యంత ముఖ్యమైన చర్యలలో వన్‌ బయో ఒకటి’ అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)