Breaking News

8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్‌ ఈవెంట్: పోస్టర్ ఆవిష్కరించిన ఐటీ మంత్రి

Published on Sat, 11/09/2024 - 17:13

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి 'దుద్దిళ్ల శ్రీధర్ బాబు' మాదాపూర్‌లోని టీ-హబ్‌లో '8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్‌ 2024' ఈవెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం నవంబర్ 20న జరగనుంది. దీనికి డిజైన్ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖు హాజరుకానున్నారు.

8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్‌ 2024 ఈవెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డిజైన్, టెక్నాలజీని ప్రోత్సహించడంలో తెలంగాణ నిబద్ధతకు ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. కాన్‌క్లేవ్‌ పరిశ్రమ అభివృద్ధికి కొత్త అవకాశాలను పెంపొందిస్తూ సృజనాత్మకతను పెంచుతుంది. అంతే కాకుండా ఇది కొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా హైదరాబాద్ ఖ్యాతిని బలోపేతం చేస్తుందని అన్నారు.

నవంబర్ 9న (శనివారం) జరిగిన ఈ కార్యక్రమానికి డిజైన్ విద్యార్థులు, పరిశ్రమ నిపుణులు, సలహాదారులతో సహా మొత్తం 250 మంది హాజరయ్యారు.

8 మ్యాట్రిక్స్ డిజైన్ కాన్‌క్లేవ్‌ 2024 ప్రతినిధి 'రాజ్ సావంకర్' ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన పరిశ్రమ నిపుణుల నేతృత్వంలో ప్యానెల్ చర్చలను హోస్ట్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాము. హాజరైనవారు విభిన్న రంగాలలో సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమం సృజనాత్మకత, సాంకేతికతను కలిపే ఏకైక వేదిక, అంతే కాకుండా.. ఇది భవిష్యత్ పురోగతికి కూడా వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)