మూడు నెలల్లో రూ.5,330 కోట్ల ఒప్పందాలు

Published on Wed, 10/16/2024 - 12:31

భారతీయ సాంకేతిక రంగంలోని కంపెనీలు 2024 జులై–సెప్టెంబర్‌ కాలంలో 635 మిలియన్‌  డాలర్ల (రూ.5,330 కోట్లు) విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఒప్పందాల విలువ 31 శాతం పెరుగుదలను నమోదు చేసినట్లు కన్సల్టింగ్‌ కంపెనీ ‘గ్రాంట్‌ థ్రాంటన్‌ భారత్‌’ వెల్లడించింది. అందుకుగల కారణాలు విశ్లేషిస్తూ సంస్థ నివేదిక విడుదల చేసింది.

నివేదికలోని వివరాల ప్రకారం..యూఎస్‌ ఫెడ్‌ ఇటీవల కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అది టెక్‌ కంపెనీలకు సానుకూలాంశంగా మారింది. లోన్లు అధికంగా జారీ చేస్తూ టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ చేసుకునేందుకు ఫైనాన్స్‌ సంస్థలు ఆసక్తి చూపుతాయి. భారత్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత అనిశ్చితులు తొలగి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడింది. దాంతో సెప్టెంబర్‌ త్రైమాసికంలో 79 ఒప్పందాలు జరిగాయి. గతంలో కంటే ఈ ఒప్పందాల విలువ 31 శాతం పెరుగుదలను నమోదు చేసింది. 20 మిలియన్‌ డాలర్ల(రూ.168 కోట్లు)కు పైగా విలువ కలిగిన డీల్స్‌ 12 నమోదయ్యాయి. విలీనాలు, కొనుగోళ్లు జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే 44 శాతం పెరిగాయి. ఇవి గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 53 శాతం అధికమై 26 డీల్స్‌కు చేరుకున్నాయి. ఈ ఒప్పందాల విలువ 205 శాతం దూసుకెళ్లి 116 మిలియన్‌ డాలర్లు(రూ.975 కోట్లు)గా నమోదైంది.

ఇదీ చదవండి: గరిష్ఠాలను చేరిన బంగారం ధర!

భారత్‌పట్ల బుల్లిష్‌గా..

‘పెట్టుబడిదారులు భారతీయ మార్కెట్‌పై చాలా బుల్లిష్‌గా ఉన్నారు. మార్కెట్లలోకి ప్రవహించే మూలధనం ప్రధాన లబ్ధిదారుల్లో భారత్‌ ఒకటి. వరుసలో పెద్ద సంఖ్యలో ఐపీవోలు ఉండటంతో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది పెట్టుబడిదారులు ఈ ఐపీవోల నుంచి మెరుగైన లాభాలు సంపాదించాలని భావిస్తున్నారు. ఏడాది కాలంలో స్టార్టప్‌ వ్యవస్థలో భారీగా నిధులు చేరాయి’ అని నివేదిక వివరించింది.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)