Breaking News

ఎంసీఎక్స్‌లో సాంకేతిక సమస్య

Published on Wed, 10/29/2025 - 03:10

ముంబై: మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ ‌ (ఎంసీఎక్స్‌)ను సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్నాయి. ఇదే కారణంతో తాజాగా మంగళవారం ట్రేడింగ్‌ 4 గంటలకు పైగా నిలిచిపోయింది. పసిడి, వెండి రేట్లు భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ట్రేడర్లలో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. చివరికి  డిజాస్టర్‌ రికవరీ సైట్‌ దన్నుతో మధ్యాహ్నం 1.25 గం.లకు కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. దీనిపై విచారణ జరుపుతున్నట్లు ఎక్స్ఛేంజ్‌ వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. ఎంసీఎక్స్‌లో ఉదయం 9 గం.లకు ప్రారంభం కావాల్సిన ట్రేడింగ్, సాంకేతిక సమస్య కారణంగా ముందు 9.30 గం.లకు వాయిదా పడింది.

ఆ తర్వాత 10 గం.లకు, అటుపైన 10.30 గం.లకు, 11.49, 12.35 గం.లకు వాయిదాల పర్వం కొనసాగింది. చివరికి మధ్యాహ్నం 1.20 –1.24 గం.ల మధ్య స్పెషల్‌ సెషన్‌ నిర్వహించి, 1.25 గం.లకు సాధారణ ట్రేడింగ్‌ ప్రారంభించారు. సాంకేతిక సమస్య వల్ల పసిడి, వెండి, క్రూడాయిల్‌తో పాటు కాపర్, జింక్, అల్యూమినియంలాంటి బేస్‌ మెటల్స్‌ ట్రేడింగ్‌పైనా తీవ్ర ప్రభావం పడింది.

టెక్నికల్‌ సమస్యల వల్ల ఎంసీఎక్స్‌లో ఈ ఏడాది జూలైలో కూడా గంట ఆలస్యంగా ట్రేడింగ్‌ ప్రారంభమైంది. అంతకు ముందు గతేడాది ఫిబ్రవరిలో కొత్త ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాంలో సమస్యలు తలెత్తడంతో కార్యకలాపాలను ఏకంగా నాలుగు గంటల పాటు నిలిపివేయాల్సి వచ్చింది.  
బీఎస్‌ఈలో మంగళవారం ఎంసీఎక్స్‌ షేరు 2%  క్షీణించి రూ. 9,118 వద్ద క్లోజయ్యింది.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)