Breaking News

జాబ్‌లో చేరిన 4 నెలల్లోనే రూ.1లక్ష వేతనం పెంపు

Published on Wed, 10/08/2025 - 14:57

వేతనాల పెంపు కోసం చాలా మంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తుంటారు. కానీ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కేవలం నాలుగు నెలల్లోనే భారీ వేతన పెంపును అందుకున్నాడు. కంపెనీలో చేరినప్పుడు తన సీటీసీ(CTC)లో 100% పెరిగిన కొద్ది నెలలకే మరోసారి వేతన పెంపు అందుకున్నాడు. ఈమేరకు రెడ్డిట్‌లో చేసిన పోస్ట్‌ కాస్తా వైరల్‌గా మారింది.

పోస్ట్‌లోని వివరాల ప్రకారం..‘నేను ప్రముఖ కంపెనీలో ఇటీవలే చేరాను. నాకు 7.2 ఏళ్ల పని అనుభవం ఉంది. అంతకుముందు పని చేసిన కంపెనీతో పోలిస్తే కొత్త సంస్థ 100 శాతం సీటీసీను పెంచింది. నేను ఇంటర్వ్యూలో అడిగిన దానికంటే ఎక్కువగానే వేతనం ఇచ్చారు. దాంతో నాకు ఏటా రూ.31 లక్షలు ఆఫర్‌ చేశారు. కొత్త సంస్థలో చేరి నాలుగు నెలలైంది. ఇటీవల అప్రైజల్స్‌ వచ్చాయి. అందులో ఆశ్చర్యంగా నాకు మరో లక్ష పెంచారు. దాంతో నా వార్షిక వేతనం రూ.32 లక్షలైంది’ అని రాసుకొచ్చారు.

ఈ వ్యవహారంపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఇది అసాధారణమైనది కాదు. మంచి స్టార్టప్‌ కంపెనీలు నైపుణ్యాలున్న వారి కోసం ఇలా చేస్తాయి’ అని ఒకరు తెలిపారు. మరోవ్యక్తి స్పందిస్తూ..‘కేవలం 5 నెలల్లోనే నేను 16% పెంపు పొందాను’ అని చెప్పారు.

Reddit post

ఇదీ చదవండి: అమెరికా పొమ్మంటూంటే.. ఇవి రమ్మంటున్నాయి!

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)