Breaking News

‘నేనో మేనేజర్‌ని.. టీమ్‌ సభ్యులకంటే జీతం తక్కువ’

Published on Mon, 09/22/2025 - 10:40

టెక్‌ కంపెనీ ఉద్యోగులకు ప్రస్తుత జాబ్‌ మార్కెట్‌ ప్రతికూలంగా మారుతోంది. ఇదే అదనుగా కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగులకు జీతాలు పెంచడంలేదు. కొన్నిసార్లు పదోన్నతి ఇచ్చినా తక్కువ వేతనమే ఆఫర్‌ చేస్తున్నాయి. ఇటీవల రిపోర్టింగ్‌ మేనేజర్‌గా పదోన్నతి పొందిన ఓ టెక్‌ ఉద్యోగి వేతనం తన టీమ్‌ సభ్యుల కంటే తక్కువగా ఉందని ఆందోళన చెందాడు. వారి కంటే ఎంతో కష్టపడుతున్నా వేతనం మాత్రం పెంచడంలేదని సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. అదికాస్తా వైరల్‌గా మారింది.

అంతర్జాతీయంగా టెక్‌ సంస్థల కస్టమర్లు పెద్దగా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపకపోతుండడంతో కంపెనీలు కొత్తగా రిక్రూట్‌మెంట్‌ ఆపేస్తున్నాయి. దాంతో ఉన్నవారితోనే ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని భావిస్తున్నాయి. ఇదే అదనుగా సంస్థలో అనుభవం ఉన్న ఉద్యోగులకు పదోన్నతులిస్తున్నా అందుకు సమానంగా వేతనాన్ని మాత్రం పెంచడం లేదు.

రెడ్డిట్‌ పోస్ట్‌లోని వివరాల ప్రకారం..‘నేను ఇటీవల రిపోర్టింగ్ మేనేజర్‌గా పదోన్నతి పొందాను. ప్రస్తుతం ఒక ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నాను. నాతోపాటు 11 మంది జట్టులో ఉన్నాం. నా సహచరులకు సరాసరి రూ.15 లక్షల ప్యాకేజీ ఉంది. అందులో కొందరు రూ.25 లక్షలు సంపాదిస్తున్నారు. కానీ నాకు రూ.9 లక్షల ప్యాకేజీ మాత్రమే. జట్టుకు మేనేజర​్‌ స్థాయిలో ఉన్న నాకు సభ్యుల కంటే తక్కువ జీతం ఉంది. నేను వారాంతాల్లోనూ పని చేస్తున్నాను. దాదాపు ప్రతిరోజు అర్థరాత్రి వరకు వర్క్‌ చేస్తున్నాను. నా కంటే అధిక వేతనం పొందే సహోద్యోగులు సాయంత్రం 6 గంటలకు షట్‌డౌన్‌ చేస్తున్నారు. క్లిష్టమైన పనులను తప్పించుకుంటున్నారు. నా జీతం పెంచాలని పలుమార్లు హెచ్‌ఆర్‌కు మెయిళ్లు కూడా పంపాను. కానీ ఫలితం లేకపోయింది. భయట అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఏం చేయాలో సూచించండి’ అంటూ సలహా కోరాడు.

ఈ రెడ్డిట్ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. ‘మీ నైపుణ్యాలు, మార్కెట్ విలువపై దృష్టి పెట్టండి. జీతంపై ఆందోళన వద్దు’ అని ఒకరు చెప్పారు. ‘మరింత ప్రయత్నం చేసి వేరే కంపెనీకి షిఫ్ట్‌ అవ్వండి’ అని ఒకరు రాసుకొచ్చారు. ‘హెచ్‌ఆర్‌తో చర్చించేప్పుడు సహోద్యోగులతో ప్రత్యక్ష పోలికలు వద్దు’ అని మరొకరు తెలిపారు.

ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)