Breaking News

రెండే రెండు పిజ్జాలు.. రూ. 8 వేల కోట్లు

Published on Tue, 12/24/2024 - 16:05

ఒక బిట్‌కాయిన్ ధర ఈ రోజు సుమారు రూ. 80 లక్షల కంటే ఎక్కువే. కాబట్టి ఎవరైనా 10,000 బిట్‌కాయిన్‌లను కలిగి ఉంటే.. అతడు పెద్ద సంపన్నుడనే చెప్పాలి. అయితే కొన్ని సంవత్సరాలకు ముందు ఓ వ్యక్తి 10వేల బిట్‌కాయిన్‌లు (Bitcoins) చెల్లించి కేవలం రెండు పిజ్జాలను కొనుగోలు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

అమెరికాకు చెందిన ఐటీ ప్రోగ్రామర్ 'లాస్లో హనిఎజ్' (Laszlo Hanyecz) 2010 మే 17న తన దగ్గరున్న 10వేల బిట్‌కాయిన్‌లను డాలర్లలోకి మార్చుకున్నాడు. ఆ డాలర్లతో 2 డామినోస్ పిజ్జాలను ఆర్డర్ చేసుకుని తినేసాడు. ఆ బిట్‌కాయిన్‌ల విలువ నేడు రూ. 8వేల కోట్లు. అయితే హనిఎజ్ ఇప్పుడు పశ్చాతాప పడిన ఏం ప్రయోజనం లేదు.

బిట్‌కాయిన్
2010లో ఒక బిట్‌కాయిన్ విలువ 0.05 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 2.29 రూపాయలకు సమానమన్నమాట. అయితే ఈ రోజు ఒక బిట్‌కాయిన్ విలువ రూ. 80 లక్షల కంటే ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే బిట్‌కాయిన్ విలువ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

అమెరికా ఎన్నికల్లో 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) గెలిచిన తరువాత బిట్‌కాయిన్ విలువ భారీగా పెరిగింది. కొన్నాళ్ల కిందట తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఇప్పుడు లక్ష డాలర్ల మార్కుని దాటేసింది. కాగా ఇటీవల కాలంలో బిట్‌కాయిన్ కొంత తగ్గుముఖం పట్టింది. ట్రంప్ గెలుపు తరువాత బిట్‌కాయిన్ విలువ తగ్గడం ఇదే మొదటిసారి.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)