Breaking News

రూ.80 లక్షల జీతం: సలహా ఇవ్వండి.. టెకీ పోస్ట్ వైరల్

Published on Fri, 10/18/2024 - 17:58

ఎవరైనా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాన్ని ఎంచుకుంటారనేది సర్వసాధారణం. ఓ వ్యక్తి తనకు రూ.80 లక్షల జీతం వస్తోందని, ఇప్పుడు బెంగళూరులో రూ.50 లక్షల జీతానికి ఆఫర్ వచ్చిందని వెల్లడించారు. అయితే ఇప్పుడు నేను బెంగుళూరుకు రావాలా? వద్దా? అనే సందేహాన్ని రెడ్డిట్‌లో వెల్లడించారు.

నాకు ఐరోపాలో ఐదు సంవత్సరాలు ఉద్యోగానుభవం ఉంది. నా జీతం రూ.80 లక్షల సీటీసీ. నాకు బెంగళూరులో దాదాపు రూ.50 లక్షల సీటీసీ ఆఫర్ వచ్చింది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, జాబ్ మార్కెట్ కూడా బాగుంటుందని ఈ ఆఫర్‌కు అంగీకరించాలనుకుంటున్నాను. దీనికి నా కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు. దీనికి ఓ సలహా ఇవ్వండి? అని రెడ్డిట్‌లో అడిగారు.

ఈ పోస్ట్ రెడ్డిట్‌లో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. భారతదేశంలో పని ఒత్తిడి అధికం, అవినీతి, కల్తీ ఆహారం, కలుషితమైన గాలి, నీరు ఇలా చాలా ఉన్నాయని ఓ వ్యక్తి పేర్కొన్నారు.

యూరప్‌లో ఉద్యోగంలో స్థిరత్వాన్ని, ముఖ్యంగా తొలగింపులు సందర్బాలను గురించి మరికొందరు వివరించారు. మీకు ఉద్యోగంలో స్థిరత్వం వద్దు, పని భారం ఎక్కువ కావాలనుకుంటే ముందుకు సాగండి అని పేర్కొన్నారు. భారతదేశ జీవన నాణ్యతలో విస్తృత సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని మరికొందరు హెచ్చరించారు.

ఇదీ చదవండి: చాట్‌జీపీటీ రెజ్యూమ్‌.. చూడగానే షాకైన సీఈఓ

భారతదేశంలో ప్రభుత్వ అధికారులతో మంచి సత్సంబంధాలు ఉంటే, మీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే హాయిగా జీవించవచ్చు అని ఇంకొందరు అన్నారు. యూరోప్ నుంచి ఇండియాకు రావాలంటే మీకు నెల రోజుల సెలవు లభిస్తుంది.. కానీ మీరు బెంగుళూరుకు వెళ్లినట్లయితే 15 రోజులు సెలవు లభించడం కూడా కష్టం అని అన్నారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)