Breaking News

ఫోన్‌ సరిగ్గా ఛార్జింగ్‌ పెట్టడం తెలుసా..?

Published on Sat, 02/15/2025 - 15:00

స్మార్ట్‌ఫోన్‌ను సరిగ్గా ఛార్జింగ్‌ చేయడం తెలుసా అంటే మీరేంమంటారు.. ‘ఇదేం ప్రశ్న..? సాధారణంగా ఛార్జింగ్‌ కేబుల్‌తో ఛార్జ్‌ పెడితే సరి’ అనుకుంటారు కదా. కానీ సరైన సమయంలో, సరైన విధంగా స్మార్ట్‌ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టకపోతే బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఫోన్‌కు ఛార్జింగ్‌ పెడుతున్నప్పుడు ఎలాంటి అంశాలు గమనించాలో తెలుసుకుందాం.

ఇతర ఛార్జర్లను ఉపయోగించడం

ప్రతిఫోన్‌కు ప్రత్యేకంగా కంపెనీ ఛార్జర్‌ తయారు చేస్తుంది. ప్రతిసారి ఆ ఛార్జర్‌తోనే ఛార్జ్‌ చేయాలి. లేదంటే ఫోన్‌ పాడవుతుంది. పొంతన లేని ఛార్జర్లు కరెంట్‌ వోల్టేజ్‌ను కొన్నిసార్లు అధికంగా, ఇంకొన్నిసార్లు తక్కువగా సరఫరా చేస్తాయి. ఇది బ్యాటరీని దెబ్బతీస్తుంది. కాబట్టి సర్టిఫైడ్ ఛార్జర్లను వినియోగించాలి.

రాత్రంతా ఛార్జింగ్

చాలామందికి లేట్‌నైట్‌ వరకు ఫోన్‌ ఉపయోగించి ఛార్జ్‌ చేసి పడుకోవడం అలవాటు. రాత్రంతా కరెంట్‌ సరఫరా అవ్వడంతో ఓవర్ ఛార్జింగ్‌ అవుతుంది. దాంతో బ్యాటరీ బల్జ్‌ అయ్యేందుకు దారితీస్తుంది.

ఛార్జింగ్‌ చేస్తూ ఫోన్‌ వాడడం

ఛార్జింగ్‌ చేసినప్పుడు ఎట్టిపరిస్థితిలో ఫోన్‌ వాడకూడదు. తప్పని పరిస్థితిలో వాడాల్సి వస్తే ఛార్జింగ్‌ రిమూవ్‌ చేసి వాడుకోవాలి. ఇది చాలా సాధారణ విషయంగా కనిపించినా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఇబ్బంది పడాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్లను విస్మరించడం

ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సర్వీసు అందిస్తున్న కంపెనీలు, మొబైల్‌ తయారీ కంపెనీ నిత్యం వాటి సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్లను అందిస్తాయి. క్రమం తప్పకుండా వాటిని అప్‌డేట్‌ చేసుకోవాలి. బ్యాటరీ, ఛార్జింగ్‌ సమస్యలకు సంబంధించిన అప్‌డేట్లను కంపెనీ అందిస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అవుతాయి.

0% నుంచి 100% వరకు

ఫోన్‌ వాడుతున్నప్పుడు మొత్తం ఛార్జింగ్‌ అయిపోయేంత వరకు చూడకుండా సుమారు 40 శాతం బ్యాటరీ ఉన్నప్పుడే ఛార్జ్‌ పెట్టాలి. తరచుగా 0% నుంచి 100% వరకు ఛార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది.

చలి, వేడికి దగ్గరగా..

విపరీతమైన వేడి, చలి రెండూ ఫోన్ బ్యాటరీని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఫోన్‌ను నేరుగా వేడి ప్రదేశంలో ఛార్జ్ చేయడం లేదా ఎండలో వదిలివేయడం చేయకూడదు. అదేవిధంగా, చాలా చల్లని వాతావరణంలో ఛార్జింగ్ చేయడం కూడా బ్యాటరీకి హాని కలిగిస్తుంది.

దెబ్బతిన్న కేబుల్‌తో ఛార్జింగ్‌

పగిలిన లేదా దెబ్బతిన్న, అతుకులున్న ఛార్జింగ్ కేబుల్స్ వాడకూడదు. ఇవి అస్థిరమైన ఛార్జింగ్, షార్ట్ సర్క్యూట్లకు కారణమవుతాయి. కొన్నిసార్లు అగ్ని ప్రమాదాన్ని కలిగిస్తాయి.

ఇదీ చదవండి: టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!

ఛార్జింగ్ పోర్ట్‌ను శుభ్రం చేయకపోవడం

ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌లో దుమ్ము పేరుకుపోతూంటుంది. ఇది పేలవమైన కనెక్షన్, ఛార్జింగ్ సమస్యలకు దారితీస్తుంది. మృదువైన బ్రష్ లేదా కంప్రెస్డ్ ఎయిర్ ఉపయోగించి పోర్ట్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)