Breaking News

మారుమూల గ్రామాల్లోని యువతకు టెక్‌ శిక్షణ.. నెక్స్ట్‌ వేవ్‌ & ఎన్‌ఎస్‌డిసి కృషితో కొత్త అధ్యాయం

Published on Sat, 06/14/2025 - 16:21

ఉత్తరప్రదేశ్ బాగ్‌పత్ జిల్లాలోని ఛప్రాలి అనే గ్రామంలో యువతకు కొత్త భవిష్యత్తు చూపిస్తూ ఒక పెనుమార్చు తెచ్చే విద్యా కార్యక్రమం మొదలైంది. నెక్స్ట్‌ వేవ్‌, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) కలసి గ్రామీణ ఉత్తరప్రదేశ్‌లో టెక్ స్కిల్స్ నేర్పే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ అఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్‌ ఆంట్రప్రైన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో గ్రామీణ మహిళా యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.

ఈ కార్యక్రమాన్ని చప్పాలిలోని చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయంలో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి గారు ప్రారంభించారు. అక్కడే “ఫ్యూచర్ స్కిల్ ల్యాబ్” పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్కిల్ ఇండియా సెంటర్లో ఆధునిక టెక్నాలజీలపై ప్రాక్టికల్ శిక్షణ ఇస్తున్నారు. అక్కడి యువతలో మార్చు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అక్కడ జాయిన్ అయిన విద్యార్థుల్లో చాలా మంది కంప్యూటర్ ఎప్పుడూ వాడలేదు. మొదటి రోజు ల్యాప్ టాప్ ఆన్ చేయడం, కీబోర్డ్ ఎలా వాడాలో నేర్పించారు. ఇప్పుడు చూస్తే వారు వెబ్ యాప్స్ రూపొందించడం మొదలు పెట్టి టెక్ రంగంలో కెరీర్ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన ఒక గొప్ప విషయం ఈ విద్యార్థుల పరిస్థితులు. వీళ్లంతా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. ఉదయం 4 గంటలకే లేచి ఇంటి పనులు, పొలంలో పనులు పూర్తి చేసి, 5నుంచి 10 కిలోమీటర్లు నడిచి స్కిల్ సెంటర్‌కు వస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు క్లాసులు అటెండ్ అవుతారు. తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లి వంట పనులు, ఇల్లు చూసుకోవాలి. అయినా 4.0 టెక్నాలజీస్ ను పట్టుదలతో నేర్చుకుంటున్నారు.

ఒకప్పుడు బిడియంగా ఉంటూ ఎవరితోనైనా మాట్లాడాలంటే ఇబ్బంది పడే స్వాతి ఖోకర్ ఇప్పుడు కెరీర్ వైపు ధైర్యంగా ముందుకు అడుగులేస్తోంది. తండ్రిని కోల్పోయిన తర్వాత కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. ప్రస్తుతం కోడింగ్ నేర్చుకుంటూ, తాను మాత్రమే కాదు, తన వయసు అమ్మాయిలందరికీ ఆదర్శంగా మారింది.

నెక్స్ట్‌ వేవ్‌ సీఈవో రాహుల్ అత్తులూరి మాట్లాడుతూ, “లక్షలాది మంది విద్యార్థులకు టెక్నాలజీ స్కిల్స్ నేర్పించడమే మా లక్ష్యం. వాళ్లు చక్కగా స్కిల్స్ నేర్చుకుని, మంచి కెరీర్ నిర్మించుకోవాలి. తమ కుటుంబాలు, దేశానికి ఉపయోగపడేలా ఎదగాలి. ఈ రోజు టెక్నాలజీలకే కాదు, రేపటి భవిష్యత్తుకి కూడా సిద్ధంగా ఉండేలా మేము తయారుచేస్తున్నాం” అన్నారు.

మొదట్లో వాళ్ళ పిల్లలు నేర్చుకోగలరా అని ఈ ప్రోగ్రాం పట్ల సందేహంగా ఉన్నతల్లిదండ్రులే ఇప్పుడు పెద్ద ఎత్తులో మద్దతు ఇస్తున్నారు. తమ పిల్లలు కోడ్ రాయటం, వెబ్ యాప్‌లు రూపొందించటం, నేర్చుకున్న విషయాల గురించి ధైర్యంగా మాట్లాడటం చూసి వాళ్ల నమ్మకాలే మారిపోయాయి. ఈ స్కిల్ సెంటర్ పై చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే తదుపరి బ్యాచ్‌లో చేర్చుకోమని 25 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

చౌదరి చరణ్ సింగ్ ప్రభుత్వ మహావిద్యాలయం ప్రిన్సిపాల్ డా. ప్రతీత్ దహియాకు ఇది ఒక పెద్ద లక్ష్యానికి మొదటి అడుగులాగా కనిపిస్తోంది. “ఈ కళాశాల భారత రత్న చౌదరి చరణ్ సింగ్ గారి పేరు మీద ఉంది,” అని చెప్పారు. “ఆయన ఎప్పుడూ దేశం అభివృద్ధి బాటలో సాగాలంటే అది గ్రామాల నుంచి జరగాలి” అని చెప్పేవారు. గ్రామీణ పిల్లలకు టెక్నాలజీ స్కిల్స్ ఉండాలన్నది ఆయన కల. ఇప్పుడు ఆ కల నిజమవుతుండడం ఆనందంగా ఉంది.”

గ్రామీణ భారతంలో పాత పద్ధతుల విద్యపై ఆదరణ తగ్గుతూ, స్కిల్స్‌తో కూడిన ప్రాక్టికల్ లెర్నింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆ మార్పునే ఈ ప్రోగ్రామ్ ప్రతిబింబిస్తోంది. నెక్స్ట్‌ వేవ్‌ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ విద్యార్థులకు కోడింగ్ మాత్రమే కాకుండా, కమ్యూనికేషన్, టీం వర్క్, సమస్యల పరిష్కారం, ప్రాజెక్ట్ ప్రాక్టీస్ ఇలా ఇండస్ట్రీ కి అవసరమైన అనేక నైపుణ్యాలు నేర్పిస్తోంది. భాష సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థులకు మెంటర్లు ఏఐ టూల్స్ ద్వారా వర్ణాక్యులర్ సపోర్ట్ ఇవ్వడమూ ఓ పెద్ద ముందడుగు.

కేవలం 6 నెలల్లోనే ముగ్గురు విద్యార్థులు ఉద్యోగాలు పొందడం వల్ల, గ్రామీణ యువతలో ఎంత వేగంగా టాలెంట్ వెలికి తీయవచ్చో స్పష్టమవుతోంది. మొదట్లో కేవలం 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన ప్రోగ్రాం, ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలనంతా తాకుతోంది. NSDC, స్థానిక నేతల మద్దతుతో నగరాల్లో మాత్రమే ఉండే అవకాశాల్ని గ్రామీణ యువతకు అందించేందుకు నెక్స్ట్‌ వేవ్ వేగంగా ముందుకెళ్తోంది. అవకాశం దరిచేరదు అనిపించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఉద్యమం మొదలైంది. ఈ కార్యక్రమం కేవలం శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, విద్యార్థులలో, కుటుంబాల్లో, గ్రామీణ భారత్ భవిష్యత్తు నిర్మాణం చేయగలదు అన్న విశ్వాసాన్ని మళ్లీ చేకూర్చడం దీని అసలైన లక్ష్యం.

NxtWave Institute of Advanced Technologies

కపిల్‌ కావురి హబ్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, నానక్‌రామ్‌గూడ, తెలంగాణ, 500032

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)