Breaking News

గిగ్‌ వర్కర్ల కోసం.. టెక్‌ మహీంద్రా ‘పాప్యులై’ ప్లాట్‌ఫామ్‌

Published on Thu, 12/14/2023 - 06:24

న్యూఢిల్లీ: తాత్కాలిక ఉద్యోగార్థులు (గిగ్‌ వర్కర్లు) ప్రముఖ కంపెనీల్లో చిరుద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునేలా సహాయపడేందుకు ఐటీ దిగ్గజం టెక్‌ మహీంద్రా కొత్తగా ‘పాప్యులై’ పేరిట క్రౌడ్‌సోర్సింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. ఇందులో ఉద్యోగార్థుల కోసం కంటెంట్‌ రేటింగ్, డేటా కలెక్షన్, డేటా ట్రాన్స్‌క్రిప్షన్, డేటా అనోటేషన్‌ వంటి తాత్కాలిక ఉద్యోగావకాశాలు ఉంటాయి. అటు కంపెనీలపరంగా చూస్తే అర్హత కలిగిన నిపుణుల డేటాబేస్‌ అందుబాటులో ఉంటుంది.

తద్వారా ఇటు ఉద్యోగార్థులకు, అటు కంపెనీలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని టెక్‌ మహీంద్రా బిజినెస్‌ హెడ్‌ (బిజినెస్‌ ప్రాసెస్‌ సరీ్వసెస్‌) బీరేంద్ర సేన్‌ తెలిపారు. తదుపరి తరం కృత్రిమ మేథ (ఏఐ) సొల్యూషన్స్‌ను రూపొందించాలంటే గణనీయంగా సమయంతో పాటు సాధారణంగా కంపెనీల్లో ఉండే ఉద్యోగులే కాకుండా బైటి నిపుణుల అవసరం కూడా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే పాప్యులై ప్లాట్‌ఫాం అంతర్జాతీయ స్థాయిలో గిగ్‌ నిపుణులను, కంపెనీలను అనుసంధానిస్తుందని తెలిపారు. దీనితో కంపెనీలు వ్యయాలు తగ్గించుకుంటూ, ఉత్పాదకత పెంచుకుంటూ .. ఏఐ సొల్యూషన్స్‌ రూపకల్పనను వేగవంతం చేసుకోవచ్చని సేన్‌ చెప్పారు. అలాగే గిగ్‌ నిపుణులు టాప్‌ ఏఐ ప్రాజెక్టులను దక్కించుకోవచ్చని, మరిన్ని వనరుల ద్వారా ఆదాయం పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.  

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)