Breaking News

ఆరు నెలల్లో భారీగా ఉపాధి అవకాశాలు

Published on Tue, 11/26/2024 - 08:20

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ ఆరు నెలల కాలంలో (2024 అక్టోబర్‌ నుంచి 2025 మార్చి వరకు) ఉపాధి అవకాశాలు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. ఈ కాలంలో సిబ్బందిని పెంచుకోనున్నట్టు 59 శాతం సంస్థలు తెలిపాయి. దీంతో ద్వితీయ ఆరు నెలల్లో 7.1 శాతం మేర సిబ్బంది పెరగనున్నట్టు టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ‘ఎంప్లాయిమెంట్‌ అవుట్‌లుక్‌ రిపోర్ట్‌’ వెల్లడించింది. ప్రస్తుత స్థాయిలోనే సిబ్బంది సంఖ్యను కొనసాగించనున్నట్టు టీమ్‌లీజ్‌ సర్వేలో 22 శాతం కంపెనీలు తెలిపాయి. 23 రంగాల్లోని 1,307 కంపెనీల అభిప్రాయాలను టీమ్‌లీజ్‌ సర్వేలో భాగంగా తెలుసుకుంది. లాజిస్టిక్స్, ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీలు), ఈవీ సదుపాయాలు, వ్యవసాయం, ఆగ్రోకెమికల్స్, ఈ–కామర్స్‌ రంగాల నుంచే ప్రధానంగా ఎక్కువ ఉపాధి అవకాశాలు రానున్నాయని, ఇవి మౌలిక వసతులు, ఆధునిక టెక్నాలజీపై ఎక్కువగా వ్యయం చేస్తున్నట్టు టీమ్‌లీజ్‌ నివేదిక తెలిపింది.  

రంగాల వారీగా..

లాజిస్టిక్స్‌ రంగంలో 14 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా రానున్నాయి. ఉద్యోగులను పెంచుకోనున్నట్టు 69 శాతం లాజిస్టిక్స్‌ కంపెనీలు వెల్లడించాయి. ఆ తర్వాత అధికంగా ఈవీ, ఈవీ ఇన్‌ఫ్రా కంపెనీలు 12 శాతం మేర సిబ్బందిని పెంచుకోనున్నాయి. వ్యవసాయం, ఆగ్రో కెమికల్స్‌ కంపెనీల్లో 10.5 శాతం మేర, ఈ–కామర్స్‌ రంగంలో 9 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా రానున్నాయి. ఆటోమోటివ్‌ రంగంలో 8.5 శాతం, రిటైల్‌ రంగంలో 8.2 శాతం మేర ఉపాధి అవకాశాలు అధికంగా ఏర్పడనున్నాయి.

ఇదీ  చదవండి: 30 లక్షల యూనిట్లు ఎగుమతి!

ప్రాంతాల వారీగా..

కోయింబత్తూర్, గురుగ్రామ్‌ ఉపాధి కల్పన కేంద్రాలుగా మారుతున్నట్టు టీమ్‌లీజ్‌ నివేదిక తెలిపింది. అత్యధికంగా బెంగళూరు 53.1 శాతం, ముంబై 50.2 శాతం, హైదరాబాద్‌ 48.2 శాతంతో ఉపాధి కల్పన పరంగా ముందున్నాయి. ఉపాధి కోరుకుంటున్న వారికి చిన్న పట్టణాలు ప్రత్యామ్నాయ కేంద్రాలుగా మారుతున్నట్టు టీమ్‌లీజ్‌ నివేదిక పేర్కొంది. గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు (జీసీసీలు) టెక్నాలజీ, ఆర్‌అండ్‌డీలో అధిక నైపుణ్య ఉద్యోగాలను సృష్టిస్తున్నట్టు తెలిపింది. జాతీయ పారిశ్రామిక నడవాల ద్వారా ప్రత్యక్షంగా 10 లక్షల మందికి పరోక్షంగా 30 లక్షల మందికి ఉపాధి కల్పించనుండడం, సెమీకండక్టర్‌ పాలసీ ద్వారా 2025 నాటికి 80,000 ఉద్యోగాల కల్పన తదితర కీలక విధానాలను ప్రస్తావించింది.
 

Videos

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)