Breaking News

టీ రూ.10.. సమోసా, కాఫీ రూ.20: ఎయిర్‌పోర్ట్‌లో తక్కువ ధరల్లో..

Published on Tue, 05/06/2025 - 16:22

టీ రూ.10, కాఫీ రూ.20 అనే ధరలు వింటుంటే ఆ ఏముంది? రోడ్డు పక్కన టీ బండిలో రేట్లు అవే కదా అందులో వింతేముంది?.. అనిపించవచ్చు కానీ... ఆ రేట్లు ఎయిర్‌పోర్ట్‌లోని కేఫ్‌లో అంటే..మాత్రం విస్తుపోవాల్సిందే. అవును మరి.. రాబోయే కొన్నేళ్లలో విమానాలు ఎక్కని వారు అంటూ ఉండరేమో కానీ.. విమానాశ్రయాల్లో టీ కూడా తాగని వారు మాత్రం బోలెడంత మంది ఉంటారేమో అనే అంచనాలు ఉండేవి. ఎందుకంటే..రాను రాను విమానయానం అందుబాటులోకి వస్తోంది. కానీ ఎయిర్‌పోర్ట్స్‌లో కనీసం టీ కూడా అందుబాటు ధరలో ఉండడం లేదు కాబట్టి.

అడపాదడపా ఎయిర్‌లైన్స్‌ వాళ్లు అందించే ఆఫర్లు ఒక్కోసారి రైలు ఛార్జీల కన్నా కూడా తక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల సామాన్యులకు కూడా విమాన ప్రయాణం సాధ్యమవుతోంది. కానీ విమానాశ్రయాల్లో కాసింత సేద తీరాలని టీ, కాఫీ లాంటివి తాగాలనుకున్నా, సమోసా, బిస్కెట్స్‌ వంటి చిరు తిండి తినాలన్నా అదేదో పెద్ద కలలాగా మారింది. ఎందుకంటే ఆ ధరల పట్టీ ఇంకా సామాన్యులకు అందనంత దూరంలోనే ఉంది. మన శంషాబాద్‌ విమానాశ్రయాల వంటి చోట అయితే కేఫ్స్‌లో ధరలు చూస్తే విమానం ఎక్కకుండానే కళ్లు తిరుగుతాయ్‌.

రకరకాల అవకాశాలవల్ల.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనో విమాన ప్రయాణం చేయాల్సిన అవసరం ఇప్పుడు మధ్యతరగతి వారికి కూడా తప్పడం లేదు. అయినప్పటికీ విమాన ప్రయాణీకులు అంటేనే సంపన్నులు అనే రీతిలో ఈ ధరలు ఉండడం సామాన్యులకు మింగుడు పడని పరిస్థితి.

ఈ నేపథ్యంలో పూణే అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం సరికొత్తగా ‘ఉడాన్‌ యాత్రి కేఫే’ అనే సేవను ప్రారంభించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్‌ మోహోల్‌  ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ఇప్పటికి ఎదురు చూసిన రోజులు ముగిశాయి టీ రూ.10, కాఫీ రూ.20 కి పూణే విమానాశ్రయంలో అందుబాటులోకి రాబోతున్నాయి,‘ అని ఆయన ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: దుబాయ్‌లో భారతీయ బిలియనీర్‌కు ఐదేళ్లు జైలు శిక్ష

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌’ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని ఈ కేఫేని ఏర్పాటు చేశారు.. ఈ కేఫే లక్షల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే పూణే విమానాశ్రయంలో, ఈ విధంగా తక్కువ ధరలకు అధిక నాణ్యత గల ఆహార పదార్థాలు అందుబాటులోకి రావడం ఒక సమయోచిత మార్పుగా భావిస్తున్నారు ప్రయాణికులు. సమోసా తదితర తినుబండారాలు సైతం రూ.20 ధరల్లో అందిస్తున్న ఈ కేఫ్స్‌ కోల్‌కతా, చెన్నై, ముంబయిలలో కూడా సేవలు అందిస్తున్నాయి. విమానాశ్రయాలు సంపన్నులుకు తప్ప సామన్యులకు కావనే అభిప్రాయాలను మార్చేలా, అత్యధిక జనాభాకు ఉపయోగపడేలా ఇలాంటి మార్పులు దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో రావాలని సామాన్య ప్రయాణికులు కోరుకుంటున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)