Breaking News

అత్యంత విలువైన బ్రాండ్స్‌లో టీసీఎస్‌ టాప్‌..

Published on Fri, 06/02/2023 - 04:27

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్‌ దేశీయంగా అత్యంత విలువైన బ్రాండ్స్‌ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2వ స్థానంలో, ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ మూడో స్థానంలో నిల్చాయి. అంతర్జాతీయ బ్రాండ్‌ కన్సల్టెన్సీ సంస్థ ఇంటర్‌బ్రాండ్‌ ..  2023కి గాను రూపొందించిన 50 అత్యంత విలువైన భారతీయ బ్రాండ్స్‌ జాబితాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం టీసీఎస్‌ బ్రాండ్‌ విలువ రూ. 1.09 లక్షల కోట్లుగా ఉండగా, రిలయన్స్‌ రూ. 65,320 కోట్లుగా, ఇన్ఫోసిస్‌ది రూ. 53,323 కోట్లుగాను ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ 4వ స్థానంలో, రిలయన్స్‌ గ్రూప్‌లో భాగమైన టెలికం, డిజిటల్‌ విభాగం జియో రూ. 49,027 కోట్ల బ్రాండ్‌ విలువతో టాప్‌ 5లో నిల్చాయి. తొలి 10 బ్రాండ్స్‌ మొత్తం విలువలో టాప్‌ 3 బ్రాండ్స్‌ వాటా ఏకంగా 46%గా ఉన్నట్లు ఇంటర్‌బ్రాండ్‌ తెలిపింది. ర్యాంకింగ్స్‌ నివేదికకు సంబంధించి వివరాలు..

► ఎయిర్‌టెల్, ఎల్‌ఐసీ, మహీంద్రా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ టాప్‌ 10 బ్రాండ్స్‌లో చోటు దక్కించుకున్నాయి.  
► లిస్టులోని మొత్తం కంపెనీల విలువ రూ. 8.3 లక్షల కోట్లు (100 బిలియన్‌ డాలర్లు) పైగా ఉంది. ఇది 100 బిలియన్‌ డాలర్ల మార్కును దాటడం ఇదే ప్రథమం.  
► మూడు టెక్నాలజీ బ్రాండ్‌లు టాప్‌ 5లో చోటు దక్కించుకోవడం గత దశాబ్ద కాలంలో ఇదే మొదటిసారి.
► గత పదేళ్లలో ఎఫ్‌ఎంసీజీ విభాగం అత్యధికంగా 25 శాతం, గృహ నిర్మాణం.. ఇన్‌ఫ్రా 17 శాతం, టెక్నాలజీ 14 శాతం వృద్ధి చెందాయి.
► టాప్‌ 10 బ్రాండ్‌ల విలువ రూ. 4.9 లక్షల కో ట్లుగా ఉండగా.. జాబితాలోని మిగతా 40 బ్రాండ్‌ల విలువ రూ. 3.3 లక్షల కోట్లు.
► ఆర్థిక సేవల రంగం నుంచి అత్యధికంగా తొమ్మిది సంస్థలు ఉండగా .. గృహ నిర్మాణం.. ఇన్‌ఫ్రా రంగం కూడా గణనీయంగా పెరిగింది. ఈ విభాగం నుంచి ఏడు సంస్థలు చోటు
దక్కించుకున్నాయి.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)