Breaking News

దేశంలో నెం.1 ఐటీ కంపెనీ.. 19 ఏళ్లలో తొలిసారి ఇలా..

Published on Sun, 04/14/2024 - 13:25

దేశంలో నంబర్‌ వన్‌ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఉద్యోగుల సంఖ్య తొలిసారి తగ్గింది. టీసీఎస్‌లో హెడ్‌కౌంట్ తగ్గడం కంపెనీ 2004లో లిస్ట్‌ అయినప్పటి నుంచి 19 ఏళ్లలో ఇదే మొదటిసారి అని కంపెనీ వెల్లడిందింది. 

హెడ్‌కౌంట్ అనేది ఒక నిర్దిష్ట వ్యవధిలో కంపెనీలో లేదా నిర్దిష్ట విభాగంలో పని చేసే సిబ్బంది సంఖ్యను సూచిస్తుంది. 202-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య 13,249 తగ్గి మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కి తగ్గిపోయిందని టీసీఎస్‌ ప్రకటించింది.  ఇక కొత్త ఉద్యోగుల నికర చేరిక మొత్తం సంవత్సరానికి కేవలం 22,600 మాత్రమే. 2022 ఆర్థిక సంవత్సరం డేటాను పరిశీలిస్తే ఆ ఏడాది కంపెనీ 1.03 లక్షల మంది ఉద్యోగులు పెరిగారు. క్యూ 4లో కంపెనీ హెడ్‌కౌంట్ 1,759 తగ్గింది.

టీసీఎస్‌లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంతో పోలిస్తే 2024 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5,680 తక్కువ. అలాగే రెండవ త్రైమాసికంలో కంపెనీలో మొత్తంంగా 6,333 మంది ఉద్యోగులు తగ్గారు. అయితే 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 523 మందిని అధికంగా నియమించుకుంది.

 

గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 24 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో టీసీఎస్‌ లాభం 9 శాతం పెరిగి రూ. 12,434 కోట్లకు చేరుకుంది. మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలానికి దాని ఆదాయం కూడా 3.5 శాతం పెరిగి రూ. 61,237 కోట్లకు చేరుకుంది. కంపెనీ లాభం అంచనాలను అధిగమించినప్పటికీ, దాని ఆదాయం మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. 

మరోవైపు టీసీఎస్‌ చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్ 2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అట్రీషన్‌ (రిటైరవడం, తొలగించడం లేదా మానేయడం ద్వారా కంపెనీని వీడటం) రేటులో 12.5 శాతం క్షీణతను నివేదించారు. రానున్న రోజుల్లో ఈ రేటు మరింత తగ్గుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)