Breaking News

ఐటీ ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్.. ఏకంగా 40000 ఉద్యోగాలు

Published on Sat, 12/21/2024 - 19:26

గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ప్రముఖ టెక్ కంపెనీ 'టీసీఎస్' కీలక ప్రకటన చేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో భారీ రిక్రూట్‌మెంట్స్‌ ఉంటాయని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ 'మిలింద్ లక్కడ్' పేర్కొన్నారు.

వచ్చే ఏడాది సుమారు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉందని.. మిలింద్ లక్కడ్ అన్నారు. అంతే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జనరేటివ్ ఏఐ (GenAI)తో సహా అత్యాధునిక సాంకేతికతలలో ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

కేవలం ఫ్రెషర్లను మాత్రమే కాకుండా.. హయ్యర్ క్యాడర్ సిబ్బంది సంఖ్యను కూడా పెంచుకోకున్నట్లు సమాచారం. సుమారు ఏడాది తరువాత కంపెనీ నియమాలను గురించి వెల్లడించింది. కరోనా మహమ్మారి తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అలవాటు పడ్డారు.

ఏఐ వంటి లేటెస్ట్ టెక్నాలజీలు పెరుగుతున్న క్రమంలో ఐటీ కంపెనీలు.. ఈ రంగంలో అభివృద్ధి చెందడానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే తమ ఉద్యోగులకు ఈ టెక్నాలజీలలో శిక్షణ ఇవ్వడానికి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నాయి.

ఇదీ చదవండి: టెక్ దిగ్గజం కీలక నిర్ణయం: 10 శాతం ఉద్యోగులు బయటకు

వారానికి ఐదు రోజులు
కరోనా తరువాత ఉద్యోగులందరూ ఆఫీసు నుంచే పనిచేయాలని, వారానికి ఐదు రోజులు ఆఫీసులో ఉండాలని పలు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ జాబితాలో టీసీఎస్ కూడా ఉంది. ఈ విధానాన్ని అమలు చేయడానికి.. కంపెనీ ప్రోత్సాహకాలతో ముడిపెట్టింది. కార్యాలయ సంస్కృతిని బలోపేతం చేయడానికి, సహకారాన్ని మెరుగుపరచడానికి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మళ్ళీ మొదలుపెట్టింది.

Videos

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)