బలవంతపు రాజీనామాలు!.. ఆందోళనలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

Published on Tue, 09/30/2025 - 15:44

భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) తన ఉద్యోగులలో సుమారు 2 శాతం లేదా 12,000 ఉద్యోగాలను తగ్గించుకోవడానికి ప్రణాళిక వేసినట్లు రెండు నెలల క్రితమే ప్రకటించింది. ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే.. టీసీఎస్ తన ఉద్యోగులను బలవంతంగా రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కంపెనీలో ఏం జరుగుతోందనే విషయాన్ని.. ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో వెల్లడించారు. మూడు రోజుల క్రితం నన్ను మీటింగ్ రూమ్‌కు పిలిచి, రాజీనామా చేయాలని చెప్పారు. కానీ నేను దాన్ని తిరస్కరించాను. అయితే నాలో భయం మొదలైంది. టీసీఎస్ నేను ఉద్యోగం చేస్తున్న మొదటి కంపెనీ. కాబట్టి నేను కోల్పోవడానికి పెద్దగా ఏమీ లేదు. కానీ రాజీనామా చేయకపోతే.. టెర్మినేషన్ తరువాత బ్యాడ్ రివ్యూ ఇస్తామని కూడా బెదిరించారు. మీకు నచ్చినట్లు చేయండి, రాజీనామా మాత్రం చేయనని చెప్పేశాను. నాలో భయం, బాధ ఉన్నప్పటికీ.. ధైర్యంగా ఉండటానికి ప్రయత్నించానని పేర్కొన్నారు.

మరో ఉద్యోగి కూడా తన అనుభవాన్ని షేర్ చేశారు. నన్ను రాజీనామా చేయమని ఒక ప్యానెల్ ఎదురుచూస్తోంది. నేను రోజూ సక్రంగా పని చేస్తున్నాను. అంతే కాకుండా.. ప్రతి కాల్, మెసేజ్, మెయిల్స్ వంటి వాటికి స్పందిస్తున్నాను. నా కుటుంబంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి నేను ఒక్కడినే అని, నా ఉద్యోగం పోతే నా పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుందని పేర్కొన్నాను. కానీ ఒకదానికొకటి లింక్ చేయవద్దని హెచ్ఆర్ చెప్పారు. ఇప్పుడు నేను జాబ్ కోసం సెర్చ్ చేసుకుంటున్నానని ఆ ఉద్యోగి వెల్లడించారు.

ఉద్యోగులను తొలగిస్తున్న వేళ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)కు వ్యతిరేకంగా దేశంలోని ప్రధాన నగరాల్లో IT & ITES ఉద్యోగుల సంఘం (UNITE) ప్రదర్శనలు నిర్వహించింది. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు దాదాపు 30,000 మందిని ప్రభావితం చేస్తాయని ఆరోపించింది . అయితే, టీసీఎస్ ఈ వాదనను తిరస్కరించింది. ఈ తగ్గింపు దాని ప్రపంచ శ్రామిక శక్తిలో దాదాపు 2 శాతం లేదా దాదాపు 12,000 మందికి పరిమితం అని పేర్కొంది.

ఇదీ చదవండి: మాంద్యం ఎఫెక్ట్: భారీ లేఆప్స్ ప్రకటించిన లుఫ్తాన్స

సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU) మద్దతుతో దేశంలో నిరసనలు జరిగాయి. UNITE నాయకులు TCS తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. తొలగింపుల సంఖ్య వెల్లడించిన దానికంటే ఎక్కువగా ఉండవచ్చని హెచ్చరించారు. కాగా టీసీఎస్ కంపెనీలో ప్రపంచ వ్యాప్తంగా 6,00,000 కంటే ఎక్కువమంది పనిచేస్తున్నట్లు సమాచారం.

Videos

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)