Breaking News

టీసీఎస్‌ లేఆఫ్స్‌తో ఆర్థిక ప్రకంపనలు

Published on Tue, 07/29/2025 - 12:54

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా తన మొత్తం సిబ్బందిలో 2 శాతం ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత జైరాం రమేష్ స్పందించారు. టీసీఎస్‌ ప్రకటన ఆర్థిక ప్రకంపనలకు(ఎకనామిక్‌ ఎర్త్‌క్వేక్‌) కారణమవుతుందన్నారు. భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్‌ 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇందులో ప్రభావితం చెందే వారిలో ఎక్కువ మంది మిడిల్, సీనియర్ గ్రేడ్‌ ఉద్యోగులు ఉండబోతున్నట్లు సంస్థ తెలిపింది.

2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. ఇటీవల ముగిసిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5,000 మంది ఉద్యోగులను చేర్చుకుంది. ‘నైపుణ్యాల అసమతుల్యత వల్ల కంపెనీ ఈమేరకు ప్రకటన చేసి ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ వార్త ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇది ఆర్థిక ప్రకంకపనలు సృష్టిస్తుంది’ అని జైరాం రమేష్‌ తన ఎక్స్‌ ఖాతాలో తెలిపారు. టెక్నాలజీ, కృత్రిమ మేధ, మార్కెట్ విస్తరణ, శ్రామిక శక్తి పునర్వ్యవస్థీకరణలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉంటున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ విస్తృత వ్యూహంలో భాగంగా లేఆఫ్స్‌ నిర్ణయం తీసుకున్నట్లు టీసీఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ టారిప్‌లపై కీలక ప్రకటన

బాధిత ఉద్యోగులకు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి కార్యక్రమాలు ఉపాధి కల్పనను పెంచడానికి ఎలా సహాయపడతాయనే దానిపై కేంద్ర ఐటీ శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, టెక్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలగింపులపై మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది.. అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడాన్ని పరిశీలిస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)