Breaking News

వృద్ధుల సంరక్షణకు టీసీఎస్‌ ఏఐ పరిష్కారం

Published on Wed, 11/12/2025 - 17:17

అనేక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అందించే దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. మరో క్లిష్టమైన సామాజిక సమస్యకు ఐటీ పరిష్కారాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా యూరప్‌లోనే అతిపెద్ద స్వతంత్ర పరిశోధనాభివృద్ధి సంస్థ సింటెఫ్‌తో చేతులు కలిపింది.

ప్రస్తుత రోజుల్లో వయసు పైబడిన పెద్దవారిని చూసుకోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. పిల్లలు తమ ఉద్యోగాలు, వృత్తి రీత్యా ఎక్కడో ఉంటున్నారు. దీంతో వయసు మళ్లిన వృద్ధులు ఇంట్లో ఒంటరిగానే జీవిస్తున్నారు. ఈ క్రమంలో తమను పట్టించుకునేవారు లేరని ఇలు పెద్దవారు, తమవారి బాగోగులను పర్యవేక్షించే అవకాశం ఉండటం లేదని వారి పిల్లలు మథనపడుతుంటారు.

ఈ సమస్యకు సులువైన పరిష్కారాన్ని అందిస్తూ.. వృద్ధుల సంరక్షణను సరికొత్తగా మార్చే లక్ష్యంతో కృత్రిమ మేధస్సు (ఏఐ) పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి టీసీఎస్.. యూరప్‌లోని అతిపెద్ద స్వతంత్ర పరిశోధనా సంస్థలలో ఒకటైన సింటెఫ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

ఈ భాగస్వామ్యం సింటెఫ్‌ స్మార్ట్ ఇన్‌క్లూజివ్ లివింగ్ ఎన్విరాన్మెంట్స్ (SMILE) ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి పెడుతుంది. ఇది ఏఐ, సెన్సార్లు, డేటా అనలిటిక్స్‌ సాయంతో ఇళ్లలో వృద్ధుల సంరక్షణను, పర్యవేక్షించడానికి, సహకారం ఇవ్వడానికి ఏఐ, సెన్సార్లు, డేటా అనలిటిక్స్‌ను ఏకీకృతం చేస్తుంది.

ఒంటరిగా ఉంటూ వృద్ధాప్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు దూరంగా ఉన్న తమ కుటుంబ సభ్యులు, సంరక్షకులు, తమ ఇతర వయో వృద్ధులతో ఎప్పటికప్పుడు అనుసంధానమై ఉంటూ ఇంట్లో తమంతట తాము స్వతంత్రంగా, సురక్షితంగా జీవించేందుకు సహాకారం అందించేలా స్మైల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.

స్మార్ట్ టెక్నాలజీలను ఉపయోగించి, ఇది రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. రానున్న ఆరోగ్య సమస్యలను గుర్తించి సకాలంలో సంరక్షకులకు సమాచారం అందిస్తుంది.

#

Tags : 1

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)