Breaking News

టీసీఎస్, ఇన్ఫోసిస్‌.. తిరుగులేని బ్రాండ్లు

Published on Thu, 01/22/2026 - 08:20

భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్‌ అంతర్జాతీయంగా అత్యంత విలువైన బ్రాండ్లుగా తమ ఆధిపత్యాన్ని కాపాడుకున్నాయి. బ్రాండ్‌ ఫైనాన్స్‌ తాజా నివేదిక ‘ఐటీ సర్వీసెస్‌ 25 (2026)’ నివేదికలో టీసీఎస్‌ అంతర్జాతీయంగా రెండో స్థానంలో నిలవగా, ఇన్ఫోసిస్‌ మూడో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా టాప్‌–25 విలువైన ఐటీ బ్రాండ్లు ఇందులో చోటుచేసుకున్నాయి.

అమెరికా, భారత్‌ చెరో ఎనిమిది ర్యాంకులతో ముందున్నాయి. యాక్సెంచర్‌ 42.3 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ సంస్థగా మొదటి స్థానంలో నిలిచింది. యాక్సెంచర్‌ మొదటి స్థానంలో నిలవడం ఇది వరుసగా ఎనిమిదో ఏడాది. టీసీఎస్‌ వరుసగా ఐదో ఏడాది ఈ జాబితాలో రెండో స్థానాన్ని కాపాడుకుంది. టీసీఎస్‌ విలువను 21.2 బిలియన్‌ డాలర్లుగా బ్రాండ్‌ ఫైనాన్స్‌ అంచనా వేసింది.

ఇక 16.4 బిలియన్‌ డాలర్లతో మూడో అత్యంత విలువైన బ్రాండ్‌గా ఇన్ఫోసిస్‌ నిలిచింది. గత ఆరేళ్లుగా మూడో స్థానంలో ఉంటూ వస్తున్న ఇన్ఫోసిస్‌ విలువ ఏటా 15 శాతం చొప్పున పెరగడం గమనార్హం. హెచ్‌సీఎల్‌ టెక్, విప్రో టాప్‌–10లో చోటు దక్కించుకోగా.. టెక్‌ మహీంద్రా 12వ స్థానంలో ఉంది. అలాగే, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్, హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ సైతం ఈ జాబితాలో భారత్‌ నుంచి విలువైన బ్రాండ్లుగా నిలిచాయి. 

Videos

జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం

జార్ఖండ్‌లోని చైబాసాలో భారీ ఎన్ కౌంటర్

Viral Video: నంద్యాల బస్సు ప్రమాదం CCTV వీడియో

YS Jagan: ఏంటి బాబు ఈ పనికిమాలిన పనులు

YS Jagan: నీకు కొడుకు వయసులో ఉన్నా.. నాతో కూడా పోటీ పడలేకపోతున్నావ్

సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు బాబు బండారం బయటపెట్టిన వైఎస్ జగన్

భూ రీసర్వే పై YS జగన్ రియాక్షన్

YS Jagan: సొమ్మొకరిది.. సోకొకరిది

13 రూపాయల వడ్డీ టైం కి ఇవ్వకపోతే అంతు చూస్తా..!

గుర్తుపెట్టుకో బాబూ.. రేపు మా వాళ్లు నేను ఆపినా ఆగరు!

Photos

+5

ఇప్పుడు స్టార్‌ సెలబ్రిటీస్‌.. పదేళ్ల కిందట ఎలా ఉన్నారంటే? (ఫోటోలు)

+5

బ్లాక్‌ & వైట్‌ డ్రెస్‌లో జిగేలుమంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

మేడారం మహాజాతరలో తొలిఘట్టం...ఘనంగా మండమెలిగె పండుగ (ఫొటోలు)

+5

ఫుల్‌ జోష్‌లో బిగ్‌బాస్‌ విష్ణు ప్రియ (ఫోటోలు)

+5

ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

కాలుదువ్వుతూ..రంకెలేస్తూ రంగంపేట జల్లికట్టు (ఫొటోలు)

+5

కడప : అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం..హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌..తొలి టి20లో భారత్‌ ఘనవిజయం (ఫొటోలు)

+5

అదే మొదటిసారి అంటున్న రుక్మిణి వసంత్‌ (ఫోటోలు)

+5

ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో హీరోయిన్ లక్ష‍్మీరాయ్ పూజలు (ఫొటోలు)