Breaking News

టీసీఎస్‌ సంచలనం, ఇక ‘ఐటీ ఉద్యోగులకు పండగే!’

Published on Tue, 01/10/2023 - 16:04

ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో కొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని భారీ ఎత్తున ఇంటికి పంపిచేస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాం‍ద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం’ అంటూ కారణాలు చెప్పి చేతులు దులిపేసుకుంటున్నాయి. కానీ టీసీఎస్‌ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంది. రానున్న రోజుల్లో సుమారు 1.50 లక్షల మందిని నియమించుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

టెక్‌ దిగ్గజం తాజాగా క్యూ3 ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ..టీసీఎస్‌ జనవరి 9న 2023-24 ఆర్ధిక సంవత్సరం నాటికి సుమారు 1.25 లక్షల మంది నుంచి 1.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

అంతేకాదు గతేడాది డిసెంబర్‌ నెల ముగిసే సమయానికి సంస్థలో 613,974 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. క్యూ3లో 2,197 మంది ఉద్యోగులు సంస్థకు రిజైన్‌ చేశారు. అదే సమయంలో గడిచిన 18 నెలల కాలంలో భారీ ఎత్తున సిబ్బందిని హైర్‌ చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు రానున్న రోజుల్లో టీసీఎస్‌ నియామకాలు జోరుగా చేపట్టనున్నట్లు ఆ సంస్థ సీఈవో గోపీనాథన్‌ తెలిపారు. 

150,000 మంది నియామకం
టీసీఎస్ త్రైమాసిక ఫలితాల విడుదల అనంతరం కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపినాథన్ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఉద్యోగుల్ని ఎలా నియమించుకున్నామో.. రానున్న రోజుల్లో ఆ తరహా ధోరణి కొనసాగుతుంది. వచ్చే ఏడాది 1,25,000-1,50,000 మందిని నియమించుకోనున్నాం’ అని తెలిపారు.

చదవండి👉 మూన్‌లైటింగ్‌ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)