Breaking News

వీసా ఫ్రాడ్‌.. టీసీఎస్‌పై తీవ్ర ఆరోపణలు

Published on Tue, 02/18/2025 - 16:51

దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వీసా మోసం (Visa fraud) ఆరోపణలను ఎదుర్కొంటున్నట్లు సమాచారం. అమెరికా కార్మిక చట్టాలను పక్కదారి పట్టించేందుకు కంపెనీ ప్రత్యేక వర్క్ వీసాలను దుర్వినియోగం చేసిందని విజిల్‌బ్లోయర్లు ఆరోపిస్తున్నారు. ఫ్రంట్‌లైన్ కార్మికులను అమెరికాకు తీసుకురావడానికి వారిని మేనేజర్లుగా ముద్ర వేసి ఎల్‌-1ఏ మేనేజర్ వీసాలను దుర్వినియోగం చేసిందని వ్యాజ్యాలతోపాటు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ ఇన్వెస్టిగేషన్‌లోనూ ఆరోపించారు.

2017లో డోనాల్డ్ ట్రంప్ పరిపాలన ఎంప్లాయిమెంట్‌ వీసాలపై దృష్టి సారించినప్పుడు,  కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు అంతర్గత సంస్థాగత చార్ట్‌లను తప్పుగా రూపొందించాలని తనకు సూచించారని డెన్వర్‌లో టీసీఎస్‌కు ఐటీ మేనేజర్‌గా పనిచేసిన అనిల్ కిని ఆరోపించారని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఫెడరల్ పరిశీలనను తప్పించుకోవడానికి ఫ్రంట్‌లైన్ ఉద్యోగులను మేనేజర్‌లుగా తప్పుగా చూపించడమే దీని ఉద్దేశమని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

అనిల్ కిని, మరో ఇద్దరు మాజీ టీసీఎస్‌ ఉద్యోగులతో కలిసి ఫెడరల్ ఫాల్స్ క్లెయిమ్స్ యాక్ట్ కింద దావాలు దాఖలు చేశారని, కంపెనీ ఎల్‌-1ఏ వీసా వ్యవస్థను దుర్వనియోగం చేస్తోందని ఆరోపించారని నివేదిక పేర్కొంది.  మేనేజర్‌ స్థాయి అధికారుల బదిలీల కోసం ఉద్దేశించిన ఈ వీసాలు, కఠినమైన వేతనం, విద్యా అవసరాలు కలిగిన హెచ్‌-1బీ నైపుణ్యం కలిగిన కార్మిక వీసాల కంటే తక్కువ నియంత్రణలు కలిగి ఉంటాయి. అనిల్ కిని దావాను ఈ సంవత్సరం ప్రారంభంలో కొట్టివేసినప్పటికీ ఆయన ఈ నిర్ణయాన్ని అప్పీల్ చేశాడని నివేదిక వివరించింది.

ఇదీ చదవండి: టీసీఎస్‌ కొత్త డీల్‌.. ఫిన్‌లాండ్‌ కంపెనీతో..

2019 అక్టోబర్, 2023  సెప్టెంబర్ మధ్య యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) 90,000 కంటే ఎక్కువ ఎల్‌-1ఏ వీసాలను ఆమోదించింది. వీటిని ప్రధానంగా ఐటీ అవుట్‌సోర్సింగ్ సంస్థలు యూఎస్‌ కంపెనీలకు సమాచార సాంకేతిక పనులను నిర్వహించడానికి ఉపయోగించాయి. వీటిలో 6,500 కంటే ఎక్కువ ఎల్‌-1ఏ వీసాలతో టీసీఎస్‌ అగ్రస్థానంలో ఉంది. తరువాతి ఏడు అతిపెద్ద గ్రహీతలు కలిపి పొందిన ఎల్‌-1ఏ వీసాల కంటే టీసీఎస్‌ ఒక్కటే పొందిన ఎల్‌-1ఏ వీసాల సంఖ్య అధికం.

ఖండించిన టీసీఎస్‌ 
తమపై వచ్చిన ఆరోపణలను టీసీఎస్‌ తీవ్రంగా ఖండించింది. "కొనసాగుతున్న వ్యాజ్యాలపై టీసీఎస్‌ వ్యాఖ్యానించదు. అయితే కొంతమంది మాజీ ఉద్యోగుల ఈ తప్పుడు ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వీటిని గతంలో అనేక కోర్టులు, ట్రిబ్యునళ్లు తోసిపుచ్చాయి. టీసీఎస్‌ అన్ని యూఎస్‌ చట్టాలకు కట్టుబడి ఉంటుంది" అని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు వార్తా సంస్థ పేర్కొం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)