Breaking News

టీసీఎస్‌ మరో కీలక నిర్ణయం?.. ఆఫీస్‌లో ఉద్యోగులు ఇలా ఉండాల్సిందే?

Published on Tue, 10/17/2023 - 15:29

ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసే విధానానికి ప్రముఖ టెక్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) స్వస్తి పలికింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా సమాచారమిచ్చింది. దీంతో నవంబర్‌ 1నుంచి (అంచనా) సిబ్బంది  కార్యాలయాల నుంచి పనిచేయనున్నారు. ఈ తరుణంలో సిబ్బంది ధరించే దుస్తుల విషయంలో మరిన్ని ఆదేశాలు జారీ చేసింది.

వర్క్‌ ఫ్రమ్‌ ముగింపు పలికిన టీసీఎస్‌.. తాజాగా ఉద్యోగులకు మరోసారి మెయిల్స్‌ పంపింది. ఆఫీస్‌కి వచ్చే ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లో సంస్థ సంప్రదాయాల్ని మరువకూడదని గుర్తు చేసింది. ముఖ్యంగా, వేషధారణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌ఆర్‌వో) మిలింద్‌ లక్కడ్‌ ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో పేర్కొన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా టీసీఎస్‌ వాటాదారులు సంస్థ సంప్రదాయాలకు గౌరవించేలా ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. డ్రెస్‌ కోడ్‌ పాలసీలో భాగంగా సిబ్బంది విధులు నిర్వహించే సమయంలో సరైన వస్త్రధారణ ఉండేలా మార్గదర్శకత్వం చేస్తున్నట్లు లక్కడ్‌ తెలిపారు. 

ఈ సందర్భంగా నా సహచరులు దాదాపూ రెండేళ్ల పాటు ఇంటి వద్ద నుంచే పని చేశారు. ఇప్పుడు కార్యాలయాల నుంచి పనిచేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అదే సమయంలో క్లయింట్ల ఉద్యోగులు డ్రెస్‌ కోడ్‌ గురించి స్పష్టత ఇచ్చేలా లక్కడ్‌ ఉద్యోగులు మెయిల్స్‌ చేశారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఉద్యోగుల కోడ్ విషయానికి వస్తే..పురుషులు తప్పని సరిగా ఫుల్‌ - స్లీవ్డ్‌ షర్టులతో టక్‌ చేసుకోవాలి. మహిళా ఉద్యోగులు సోమవారం నుంచి గురువారం వరకు సెమినార్‌లు, క్లయింట్‌ మీటింగ్‌లలో బిజినెస్‌ ఫార్మల్స్‌ తప్పని సరి. శుక్రవారం హాఫ్ స్లీవ్ షర్టులు, టర్టిల్‌నెక్, ఖాకీ చొక్కాలు, చినోలు, కుర్తీ, సల్వార్ (మహిళలు)లను మాత్రమే అనుమతిస్తున్నట్లు నివేదికలు హైలెట్‌ చేశాయి. ఉద్యోగుల డ్రెస్‌ కోడ్‌ నిబంధనలపై టీసీఎస్‌ యాజమాన్యం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది.

చదవండి👉 జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్‌ చేసిన 21 ఏళ్ల యువతి!

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)