Breaking News

టీసీఎస్‌ ఊహించని నిర్ణయం.. షాక్‌లో ఉద్యోగులు

Published on Sat, 09/30/2023 - 11:32

ఉద్యోగులకు ప్రముఖ దేశీయ టెక్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ (టీసీఎస్‌) భారీ షాక్‌ ఇచ్చింది.  అక్టోబర్‌ 1, 2023 నుంచి హైబ్రిడ్‌ వర్క్‌కు స్వస్తి చెబుతున్నట్లు ఆ సంస్ధ ఉద్యోగులకు ఇంటర్నల్‌ మెయిల్స్‌ పంపినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

హైబ్రిడ్‌ వర్క్‌కు గుడ్‌బై చెప్పిన టీసీఎస్‌ కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరింది. ఈ పరిణామంతో దేశీయంగా ఐటీ విభాగంలో పనిచేస్తున్న మొత్తం 50 లక్షల మంది వర్క్‌ ఫోర్స్‌ ఆఫీస్‌ నుంచి వర్క్‌ చేయాల్సి ఉంటుందని సమాచారం. 

అయితే, ఈ హైబ్రిడ్‌ వర్క్‌కు పూర్తి స్థాయిలో ముగింపు పలికే వరకు ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీస్‌ రావాల్సి  ఉంటుంది. ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పిస్తుంటే  పలు విభాగాల్లో మేనేజర్లుగా పనిచేస్తున్న పై స్థాయి సిబ్బంది మాత్రం వారానికి 5 సార్లు ఆఫీస్‌ రావాల్సిందేనని టీసీఎస్‌ చెప్పినట్లు వెలుగులోకి వచ్చిన పలు నివేదికలు చెబుతున్నాయి. కంపెనీ ఫ్లెక్సిబిలిటీ/హైబ్రిడ్ పాలసీలను అలాగే కొనసాగించి అవసరమైన చోట మినహాయింపులు ఇస్తుంది.

చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) ఉద్యోగులకు ఇంటర్నల్‌ మెయిల్‌ పంపగా.. ఆ మెయిల్స్‌ ఏముందనే అంశంపై స్పష్టత వచ్చింది. యాజమాన్యం ఉద్యోగులకు పెట్టిన మెయిల్స్‌  అన్నీ విభాగాల ఉద్యోగులు తప్పని సరిగా ఆఫీస్‌కు రావాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ కొత్త నిబంధనల్ని అమలు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

అదే టీసీఎస్‌ సెప్టెంబర్ 2022 నుండి ఉద్యోగులు వారానికి మూడురోజులు కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కాదు కూడదు అంటే సదరు సిబ్బందిపై తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయని టీసీఎస్‌ హెచ్చరించింది. కాగా, హైబ్రిడ్‌ వర్క్‌ ముగింపుపై పలు మీడియా సంస్థలు టీసీఎస్‌ను సంప్రదించాయి. కానీ ఎలాంటి స్పందన రాలేదు.

చదవండి👉 జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్‌ చేసిన 21 ఏళ్ల యువతి!

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)