Breaking News

40+ ఉద్యోగులను టీసీఎస్‌ టార్గెట్‌ చేసిందా?

Published on Fri, 04/18/2025 - 12:44

లేఆఫ్‌లలో అమెరికన్‌ ఉద్యోగుల పట్ల వివిక్ష చూపుతోందంటూ వచ్చిన ఆరోపణలను భారత్‌కు చెందిన ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఖండించింది. ఈ ఆరోపణలు సంస్థ "నిరాధారమైనవి, తప్పుడు అభిప్రాయాలు" అని పేర్కొంది. తమది అందరికీ సమాన అవకాశాలు కల్పించే సంస్థ అని, సమగ్రతలో గొప్ప రికార్డ్‌ను కలిగి ఉందని టీసీఎస్‌ వివరించింది.

40 ఏళ్లకు పైబడిన, దక్షిణ ఆసియన్‌లు కాని తమను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల నుంచి టీసీఎస్‌ తొలగించిందని, కానీ H-1B వీసాలపై ఉన్న భారతీయ ఉద్యోగులను మాత్రం కొనసాగించిందని  కొందరు మాజీ ఉద్యోగులు ఆరోపించారు. 2023 చివర నుండి ఇలాంటి ఆరోపణలు వస్తుండటంతో యూఎస్‌ ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కమిషన్ (EEOC) దీనిపై విచారణ చేపట్టింది. యుకేలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పటికీ, టీసీఎస్‌ దానిని కూడా ఖండించింది.

టీసీఎస్‌పై వచ్చిన ఆరోపణలు ఇతర ఐటీ సంస్థల ఉద్యోగ విధానాలపైనా ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టీసీఎస్‌పై వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నా నేటి కార్పొరేట్ వాతావరణంలో నలభైలలో ఉన్న ఉద్యోగులే తొలగింపులకు తొలి లక్ష్యంగా మారుతున్నారని బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్ పాండే కూడా ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

పిల్లల చదువులు, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలు, ఇంటి కోసం చేసిన అప్పుల ఈఎంఐలు ఇలా సవా లక్ష ఆర్థిక భారాలను నలభైలలోకి అడుగుపెట్టిన ఉద్యోగులు మోస్తున్నారని దేశ్‌పాండే ఇటీవలి సోషల్‌ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇంతటి సమస్యలతో నెట్టుకొస్తున్న వీరినే కంపెనీలు టార్గెట్‌ చేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. పునర్‌వ్యవస్థీకరణ, సిబ్బంది కుదింపు సందర్భాల్లో మొదట నలభైలలోని ఉద్యోగులనే తొలగించి ఇంటికి పంపిస్తున్నాయని అప్రమత్తం చేశారు.

ఈ వయస్సులో ఉద్యోగం కోల్పోవడం ఆర్థికంగా, మానసికంగా తీవ్ర అస్థిరతకు గురిచేస్తుందని దేశ్‌ పాండే హెచ్చరించారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు మూడు కీలకమైన మనుగడ వ్యూహాలను ఆయన అందించారు. కృత్రిమ మేధపై నైపుణ్యాన్ని పెంచుకోవాలని, పొదుపు ఎక్కువగా చేయాలని, వ్యవస్థాపక మనస్తత్వాన్ని అలవరచుకోవాలని సూచించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)