Breaking News

నో బోనస్‌.. ఉద్యోగులకు టీసీఎస్‌ ఝలక్‌!

Published on Sun, 11/10/2024 - 11:36

దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కొంతమంది ఉద్యోగులకు ఝలక్‌ ఇచ్చింది. ఆఫీస్‌ నుంచి పని చేసే విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్న టీసీఎస్‌ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కొందరు ఉద్యోగులకు బోనస్ చెల్లింపులను తగ్గించింది.

‘మనీకంట్రోల్’ నివేదిక ప్రకారం.. జూనియర్ ఉద్యోగులు ఇప్పటికీ వారి పూర్తి త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్‌ను అందుకున్నారు. అయితే కొంతమంది సీనియర్ ఉద్యోగులకు మాత్రం బోనస్‌లో 20-40 శాతం కోత విధించింది ఐటీ దిగ్గజం. కొంతమందికైతే బోనస్ అస్సలు లభించలేదు.

“2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జూనియర్ గ్రేడ్‌లకు 100% క్యూవీఏ (త్రైమాసిక వేరియబుల్ అలవెన్స్) చెల్లించాము. ఇతర అన్ని గ్రేడ్‌లకు  క్యూవీఏ వారి యూనిట్ వ్యాపార పనితీరుపై ఆధారపడి ఉంటుంది” అని టీసీఎస్ ప్రతినిధి చెప్పినట్లుగా మీడియా నివేదికలో పేర్కొన్నారు.

టీసీఎస్‌ కార్యాలయ హాజరు, ఆయా వ్యాపార యూనిట్ల పనితీరు రెండింటి ఆధారంగా బోనస్‌లను నిర్ణయిస్తుంది. ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేలా  కంపెనీ చర్యలు తీసుకుంటోంది. హాజరు విధానాలను స్థిరంగా పాటించకపోవడం క్రమశిక్షణా చర్యకు దారితీస్తుందని టీసీఎస్‌ గతంలోనే స్పష్టం చేసింది.

కార్యాలయ హాజరు కీలకం
ఉద్యోగుల కార్యాలయ హాజరును కీలక అంశంగా చేరుస్తూ సవరించిన వేరియబుల్ పే విధానాన్ని టీసీఎస్‌ గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టింది. కొత్త విధానం ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని నిర్దేశిస్తూ నాలుగు హాజరు స్లాబ్‌లను ఏర్పాటు చేసింది. కొత్త విధానం ప్రకారం.. 60 శాతం కంటే తక్కువ సమయం కార్యాలయాల పనిచేసే ఉద్యోగులకు త్రైమాసికానికి ఎటువంటి వేరియబుల్ వేతనం లభించదు.

ఇదీ చదవండి: ఇంటెల్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..

60-75 శాతం మధ్య కార్యాలయ హాజరు ఉన్నవారు వేరియబుల్ వేతనంలో 50 శాతం అందుకుంటారు. అయితే 75-85 శాతం కార్యాలయానికి హాజరయ్యే ఉద్యోగులు వేరియబుల్ పేలో 75 శాతానికి అర్హులు. 85 శాతం కంటే ఎక్కువ ఆఫీస్‌కు వచ్చి పనిచేసినవారు మాత్రమే త్రైమాసికానికి పూర్తి వేరియబుల్ చెల్లింపును అందుకుంటారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)