Breaking News

‘వర్క్‌ ఫ్రం హోమ్‌’లో ఐటీ ఉద్యోగులు.. షాకిచ్చిన టీసీఎస్!

Published on Sun, 02/04/2024 - 13:29

ప్రముఖ దేశీయ టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్న ఉద్యోగులకు షాకిచ్చింది. త్వరలో పెరగనున్న జీతాలు, ప్రమోషన్‌లతో పాటు ఇతర సౌకర్యాలు రిటర్న్‌ టూ ఆఫీస్‌ పాలసీపై ఆధారపడి ఉంటాయని చెప్పనిట్లు సమాచారం. 

వేరియబుల్ చెల్లింపులను సైతం ఈ పాలసీతో అనుసంధానం చేసింది. అసైన్డ్ కోర్సులు పూర్తి చేసి, ప్రారంభంలో ఏడాదికి వేతనం రూ.3 లక్షలకు మించి శాలరీలు తీసుకుంటున్న ఫ్రెషర్లకు సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది.  



అంతేకాదు ఉద్యోగులు ఇకపై వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తామంటే కుదరదని, తప్పని సరిగా వాళ్లు ఆఫీస్‌కు రావాల్సిందేనని పట్టుబడుతోంది. పలు నివేదికల ప్రకారం.. ఉద్యోగులు తాము నివాసం ఉంటుంన్న ప్రాంతాలకు సమీపంలోని ఆఫీస్‌ కార్యాలయాలను ఎంపిక చేసుకోవద్దని కోరింది. తామే వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్న ఉద్యోగులు ఎక్కడి నుంచి పనిచేయాలని చెబుతామని సూచించింది.

కోవిడ్‌-19 కేసుల వారీగా పరిమిత వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను హెచ్ఆర్ విభాగం అనుమతిస్తోందని నివేదిక తెలిపింది. కాగా, ఇప్పటికే ఇన్ఫోసిస్, విప్రో సహా పలు ఐటీ సంస్థలు ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేయడాన్ని తప్పనిసరి చేశాయి. దీంతో వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం ముగిసినట్లేనని ఐటీ నిపుణులు భావిస్తుండగా.. విప్రో తప్పనిసరి హైబ్రిడ్ వర్క్ పాలసీని అమలు చేస్తోంది. ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయంలో భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది’అని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)