Breaking News

చంద్రశేఖరన్‌ ఎంపిక వాయిదా

Published on Wed, 02/25/2026 - 10:46

దేశీ కార్పొరేట్‌ దిగ్గజ గ్రూప్‌ టాటా సన్స్‌ బోర్డ్‌ తాజాగా నిర్వహించిన సమావేశంలో 62 ఏళ్ల నజరాజన్‌ చంద్రశేఖరన్‌ ఎంపికపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. గ్రూప్‌ చైర్మన్‌గా మూడోసారి పదవీ బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందుకు హోల్డింగ్‌ కంపెనీలో విభేదాలు కారణమని తెలుస్తోంది. 2027 ఫిబ్రవరితో చంద్రశేఖరన్‌ పదవీ కాలం ముగియనుంది. 

టాటా ట్రస్ట్స్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న నోయెల్‌ టాటా గ్రూప్‌లోని కొన్ని కంపెనీలకు వాటిల్లుతున్న నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా టాటా సన్స్‌ లిస్టింగ్‌పట్ల విముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నాయి. వెరసి చంద్రశేఖరన్‌ బాధ్యతల పొడిగింపుపై నిర్ణయం వాయిదాపడినట్లు తెలియజేశాయి.

టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 66 శాతం వాటా ఉంది. అయితే సమావేశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనలూ వెలువడకపోవడం గమనార్హం! కాగా.. గ్రూప్‌లోని ఒక కంపెనీ నష్టాలు నమోదు చేస్తున్నంతమాత్రాన మొత్తం గ్రూప్‌తోపాటు.. కొన్నేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న చైర్మన్‌  పనితీరును తప్పుపట్టడం సరికాదని బోర్డు సభ్యులు పలువురు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కొంతమంది డైరెక్టర్లు ఈ అంశంపై ఓటింగ్‌కు ప్రతిపాదించినప్పటికీ చంద్రశేఖరన్‌ వాయిదాకు ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.  

2017 నుంచి..

1987లో టాటా గ్రూప్‌లో చేరిన చంద్రశేఖరన్‌ తదుపరి కాలంలో ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)కు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆపై 2017 ఫిబ్రవరిలో టాటా సన్స్‌ చైర్మన్‌గా ఎంపికయ్యారు. విభిన్న బిజినెస్‌లుగల కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూప్‌ పునర్వ్యవస్థీకరణ, కన్సాలిడేషన్‌ సమయంలో మార్గదర్శకత్వం వహించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో గ్రూప్‌లోని 15 భారీ లిస్టెడ్‌ కంపెనీల ఆదాయం, నికర లాభాలు రెట్టింపయ్యాయి.

ఇదీ చదవండి: మార్కెట్‌ అనిశ్చితిలో ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)