Breaking News

TCS చేతికి హ్యాపీ హోమ్స్‌.. రూ. 2,250 కోట్ల డీల్‌

Published on Thu, 03/13/2025 - 20:52

దర్శితా సదరన్‌ ఇండియా హ్యాపీ హోమ్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) వెల్లడించింది. ఈ డీల్‌ విలువ రూ. 2,250 కోట్లు. ఒప్పందంలో భాగంగా దర్శితాకు చెందిన స్థలం, భవంతి టీసీఎస్‌కు దక్కనున్నాయి. వీటిని తమ డెలివరీ సెంటర్‌ కోసం కంపెనీ ఉపయోగించుకోనుంది.

‘2004లో ఏర్పాటైన దర్శితా సదరన్‌ ఇండియా హ్యాపీ హోమ్స్‌.. కమర్షియల్‌ ప్రాపర్టీని అభివృద్ధి చేయడం, పరిశ్రమలకు లీజుకివ్వడం తదితర కార్యకలాపాలు సాగిస్తోంది.  ఈ ప్రాపర్టీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నందున, ఆదాయ ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. అందువల్ల గత మూడు సంవత్సరాల టర్నోవర్ శూన్యం" అని రెగ్యులేటరీ ఫైలింగ్ లో కంపెనీ పేర్కొంది. రెండేళ్ల తర్వాత సంస్థలో 100 శాతం ఈక్విటీ షేర్లను టీసీఎస్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

టాటా రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు చెందిన రెండు అనుబంధ సంస్థలైన టీఆర్ఐఎల్ బెంగళూరు రియల్ ఎస్టేట్ ఫైవ్ లిమిటెడ్, టీఆర్ఐఎల్ బెంగళూరు రియల్ ఎస్టేట్ సిక్స్ లిమిటెడ్లను రూ.1,625 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో టీసీఎస్ ప్రకటించింది. ఈ ఒప్పందం 2025 జనవరి చివరి నాటికి ముగిసింది.
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)