Breaking News

విల్సన్‌కు 'టాటా'.. ఎయిరిండియా సీఈఓ కోసం కసరత్తు!

Published on Tue, 01/06/2026 - 18:05

ఎయిరిండియాకు కొత్త సీఈవోను నియమించే దిశగా టాటా గ్రూప్‌ అన్వేషణ ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ పదవీ కాలం 2027 జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. అలాగే తక్కువ ఖర్చుతో సేవలు అందించే అనుబంధ సంస్థ ‘ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌’ కొత్త ఎండీ నియామకంపైనా టాటా గ్రూప్‌ దృష్టి సారించినట్లు తెలిసింది.

‘‘2027 తర్వాత ఒప్పందాన్ని పొడిగించాలనే ఉద్దేశం విల్సన్‌కూ, టాటా గ్రూప్‌కూ లేదు. ఆయన స్థానంలో మరో వ్యక్తిని సీఈవోగా చేయాలని టాటాసన్స్‌ భావిస్తోంది. అందులో భాగంగా ఎయిరిండియాకు బాధ్యతలు చేపట్టగలిగే సామర్థ్యం కలిగిన అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నారు’’ అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా బోయింగ్‌ 787–8 ప్రమాదానికి సంబంధించిన తుది నివేదిక జూన్‌ నాటికి వెలువడే అవకాశం ఉందని సమాచారం. కాగా, టాటా హౌస్‌లో సోమవారం జరిగిన ఓ అధికారిక సమావేశానికి క్యాంప్‌బెల్‌ విల్సన్‌ హాజరు కావడం గమనార్హం.

#

Tags : 1

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)