బ్రాండ్ రేస్‌లో దేశీయ దిగ్గజాలు!

Published on Tue, 07/14/2026 - 13:40

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మందగమనం వంటి ప్రతికూల పరిస్థితులున్నా భారతీయ బ్రాండ్లు తిరుగులేని వృద్ధిని నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశీయ మార్కెట్ సత్తాను ప్రపంచ వేదికపై చాటుతున్నాయి. ప్రముఖ బ్రాండ్ వాల్యుయేషన్ కన్సల్టెన్సీ సంస్థ ‘బ్రాండ్ ఫైనాన్స్’ తాజాగా విడుదల చేసిన ‘ఇండియా 100’ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ జాబితాలో భారతదేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

రూ.2.4 లక్షల కోట్ల మార్కు

ఈ నివేదిక ప్రకారం, టాటా గ్రూప్ బ్రాండ్ విలువ గతంతో పోలిస్తే 9 శాతం వృద్ధితో 28.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.2.39 లక్షల కోట్లు) చేరుకుంది. భారతీయ కార్పొరేట్ చరిత్రలోనే ఒక బ్రాండ్ విలువ 30 బిలియన్ డాలర్ల మైలురాయికి సమీపంగా చేరడం ఇదే తొలిసారి. స్టీల్‌, ఆటోమొబైల్స్, ఐటీ సర్వీసెస్, కన్స్యూమర్ గూడ్స్ వంటి విభిన్న రంగాల్లో టాటా గ్రూప్ సర్వీసులు అందిస్తుండడమే దీనికి కారణం.

తర్వాతి స్థానాల్లో ఇవే..

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 14.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువతో దేశంలోనే రెండో అత్యంత విలువైన బ్రాండ్‌గా తన స్థానాన్ని స్థిరపరుచుకుంది. కాగా, గతేడాది కాలంలో జరిగిన అతిపెద్ద కార్పొరేట్ విలీనం (HDFC Ltdతో HDFC Bank విలీనం) కారణంగా హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ బ్రాండ్ విలువ పెరిగి ఏకంగా మూడో స్థానానికి (10.4 బిలియన్ డాలర్లు) ఎగబాకింది. ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ 10.1 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

దేశంలోని టాప్ 10 విలువైన బ్రాండ్లు ఇవే..

ర్యాంక్కంపెనీ/బ్రాండ్ పేరుబ్రాండ్ విలువ (బి.డాలర్లలో)
1టాటా గ్రూప్28.6
2ఇన్ఫోసిస్ 14.2
3హెచ్డీఎఫ్సీ గ్రూప్ 10.4
4ఎల్ఐసీ గ్రూప్10.1
5రిలయన్స్ ఇండస్ట్రీస్ 8.4
6ఎస్‌బీఐ గ్రూప్ 8.2
7భారతీ ఎయిర్‌టెల్‌7.7
8హెచ్‌సీఎల్‌ టెక్‌7.6
9లార్సెన్ అండ్ టూబ్రో7.2
10మహీంద్రా గ్రూప్6.6


అత్యంత పటిష్టమైన బ్రాండ్‌గా తాజ్

బ్రాండ్ విలువే కాకుండా వినియోగదారుల నమ్మకం, కార్పొరేట్ ప్రతిష్ట ఆధారంగా లెక్కించే ‘బ్రాండ్ స్ట్రెంత్ ఇండెక్స్’(బీఎస్‌ఐ)లో టాటా గ్రూప్‌నకు చెందిన హోటల్స్ బ్రాండ్ తాజ్ ప్రతిభ కనబరిచింది. 100కి 92.9 బీఎస్ఐ స్కోరుతో AAA+ రేటింగ్ సొంతం చేసుకుని దేశంలోనే అత్యంత పటిష్టమైన బ్రాండ్‌గా నిలిచింది.

దూసుకుపోతున్న రంగాలు ఇవే..

  • ఈ నివేదికలో అత్యధికంగా 61 శాతం వృద్ధిని నమోదు చేసుకుని టెలికాం రంగం ముందంజలో నిలిచింది. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి సంస్థలు డిజిటల్ వినియోగం పెరగడంతో వేగంగా పుంజుకున్నాయి.

  • దేశీయ బ్యాంకింగ్ బ్రాండ్ల విలువలో సగటున 26 శాతం వృద్ధి నమోదైంది. ఇండియన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గరిష్ట వృద్ధిని సాధించాయి.

  • టాటా గ్రూప్‌నకు చెందిన ఫ్యాషన్ రిటైల్ బ్రాండ్ వెస్ట్‌సైడ్ ఏకంగా 122 శాతం బ్రాండ్ విలువ వృద్ధితో భారతదేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత స్థానాల్లో మథర్‌సన్ (86%), సొనాటా సాఫ్ట్‌వేర్ (83%) నిలిచాయి.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)