Breaking News

టాటా స్టీల్‌.. 2,800 ఉద్యోగాలు కోత

Published on Fri, 08/02/2024 - 13:41

టాటా స్టీల్‌ తన ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తామన్న ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. బ్రిటన్‌ తయారీ యూనిట్‌లోని ‘కార్బన్ ఇంటెన్సివ్ బ్లాస్ట్ ఫర్నేస్‌’ మూసివేత ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పింది. ఈమేరకు టాటా స్టీల్‌ గ్లోబల్‌ సీఈఓ టీవీ నరేంద్రన్‌ రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘బ్రిటన్‌లోని టాటా స్టీల్‌ తయారీ ప్లాంట్‌లో ఉద్యోగులు కోత ఉండబోతుందని గతంలోనే ప్రకటించాం. ఆ ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులేదు. ఇప్పటికే ఒక కార్బన్-ఇంటెన్సివ్ బ్లాస్ట్ ఫర్నేస్‌ను మూసివేస్తున్నట్లు చెప్పాం. ఆమేరకు చర్యలు ప్రారంభమయ్యాయి. స్టీల్‌ ముడిసరుకుగా ఉన్న ఐరన్‌ఓర్‌ ధరలు భారీగా పెరిగాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం లేదు. యూకే ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపించాం. తయారీ యూనిట్‌లోని మరో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను సెప్టెంబర్‌లో మూసివేసేలా చర్చలు జరుగుతున్నాయి. రెండు ఫర్నేస్‌లు మూతపడడంతో సౌత్ వేల్స్‌లోని పోర్ట్ టాల్బోట్‌ యూనిట్‌లో 2,800 వరకు ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఉద్యోగులు తొలగింపు అంశం యూనియన్లు, కంపెనీ, ప్రభుత్వం సమష్టి బాధ్యత. కేవలం కంపెనీ నిర్ణయాలే వాటిని ప్రభావితం చేయవు’ అని చెప్పారు.

ఇదీ చదవండి: జులైలో పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు

బ్రిటన్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ జులైలో మాట్లాడుతూ..కొత్త ప్రభుత్వం టాటా స్టీల్‌ ప్రతినిధులతో చర్చించి ఉద్యోగులు కోతను నివారించేలా చర్యలు చేపడుతుందన్నారు. ప్లాంట్‌ నుంచి తక్కువ కార్బన్‌ విడుదలయ్యేలా అవసరమయ్యే సాంకేతిక సహాయం అందిస్తుందని చెప్పారు. ‘లోకార్బన్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్‌’ను నిర్మించడంలో సహాయం చేయడానికి గత ప్రభుత్వం టాటా స్టీల్‌తో చేసుకున్న 500 మిలియన్ పౌండ్ (రూ.5,318 ​కోట్లు) ఒప్పంద ప్యాకేజీపై కొత్త ప్రభుత్వం సంతకం చేయాల్సి ఉంది.

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)