Breaking News

ప్రముఖ కంపెనీలో 1600 ఉద్యోగాల కోత

Published on Thu, 04/10/2025 - 07:05

న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్‌ తమ నెదర్లాండ్స్‌ ప్లాంటు కార్యకలాపాలను క్రమబదీ్ధకరించుకునే క్రమంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది. మేనేజ్‌మెంట్, సపోర్ట్‌ విధులకు సంబంధించి 1,600 ఉద్యోగాల్లో కోత విధించనున్నట్లు సంస్థ తెలిపింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని, మార్జిన్లను మెరుగుపర్చుకోవడానికి, వ్యయాలు తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది.

స్థానిక మేనేజ్‌మెంట్‌ బోర్డులో కూడా కొన్ని మార్పులు, చేర్పులు చేయనున్నట్లు పేర్కొంది. ఈ విషయాలను సెంట్రల్‌ వర్క్స్‌ కౌన్సిల్‌తో పాటు ట్రేడ్‌ యూనియన్లకు కూడా తెలియజేసినట్లు కంపెనీ వివరించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో నెదర్లాండ్స్‌ ప్లాంటు 6.75 మిలియన్‌ టన్నుల లిక్విడ్‌ స్టీల్‌ ఉత్పత్తి చేసింది.

భౌగోళిక.. రాజకీయ పరిణామాల వల్ల యూరప్‌లో డిమాండ్‌ నెమ్మదించడం, వాణిజ్యం.. సరఫరా వ్యవస్థల్లో అవాంతరాలు ఏర్పడటం తదితర అంశాలు నిర్వహణ వ్యయాలపైనా, అంతిమంగా ఆర్థిక పనితీరుపైనా ప్రభావం చూపాయి. నెదర్లాండ్స్‌ ప్లాంటులో హరిత టెక్నాలజీలను అమల్లోకి తేవడానికి కట్టుబడి ఉన్నట్లు టాటా స్టీల్‌ సీఈవో టీవీ నరేంద్రన్‌ తెలిపారు. ఇందులో భాగంగా ఈ దశాబ్దం ఆఖరు నాటికి రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల స్థానంలో అధునాతన పర్యావరణహిత ఫర్నేస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు, దీనితో ఏటా 5 మిలియన్‌ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నట్లు వివరించారు. 

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)