Breaking News

భారత్‌లో ఐఫోన్ల తయారీ..టాటా గ్రూప్‌ ప్రయత్నాలు ముమ్మరం

Published on Tue, 01/10/2023 - 21:41

భారత్‌లో ఐఫోన్‌ల తయారీకి ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు మనదేశంలో ఐఫోన్‌లను తైవాన్‌కు చెందిన కంపెనీలు ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ సంస్థలు తయారు చేసి యాపిల్‌ సంస్థకు అందించేవి. ఈ తరుణంలో దేశీయ దిగ్గజ సంస్థ టాటా కంపెనీతో ఐఫోన్‌ల తయారీ కోసం యాపిల్‌ ఒప్పందం కుదుర్చుకుంది. 

ఇందుకోసం బెంగళూరుకు సమీపంలో విస్ట్రోన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌లో మెజారిటీ వాటా దక్కించుకోవడానికి టాటా సన్స్ సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాలు మరో రెండు నెలల్లో ఓ కొలిక్కి రానున్నాయి. విస్ట్రోన్-టాటా మధ్య ఒప్పందం కుదిరితే మాత్రం.. టాటా సన్స్‌కు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో ఐఫోన్ల తయారీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు యాపిల్‌తో టాటా సంస్థ సంబంధాల్ని బలోపేతం చేసుకుంటుంది. ఇప్పటికే తమిళనాడు హోసూర్ నగర పరిధిలో ఐఫోన్‌లో వినియోగించే విడి భాగాలను టాటా సన్స్ తయారు చేస్తున్నది. ఇటీవలే భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టింది. దేశవ్యాప్తంగా యాపిల్ స్టోర్లు ప్రారంభిస్తామని, ముంబైలో తొలి యాపిల్ స్టోర్ తెరుస్తామని ప్రకటించింది.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు