Breaking News

తొలి రిజర్వ్‌ కాఫీహౌస్‌ హైదరాబాద్‌లో ప్రారంభం

Published on Fri, 07/31/2026 - 15:46

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వచ్చే రెండు, మూడు సంవత్సరాల్లో ఏటా సుమారు 50–100 స్టోర్స్‌ ప్రారంభించనున్నట్లు టాటా స్టార్‌బక్స్‌ సీఈవో సుశాంత్‌ దాస్‌ వెల్లడించారు. ప్రస్తుతం సుమారు 80 పైచిలుకు నగరాల్లో 500 పైగా స్టోర్స్‌ ఉన్నట్లు ఆయన వివరించారు. పెరుగుతున్న ఆదాయాలు, మారుతున్న వినియోగదారుల అల వాట్లు మొదలైన అంశాలు దేశీయంగా కాఫీ వినియోగం పెరగడానికి తోడ్పడనున్నాయని సుశాంత్‌ పేర్కొన్నారు.

మెట్రో నగరాలు, వ్యాపార వృద్ధికి అధిక అవకాశాలు ఉన్న పట్టణాల్లో విస్తరణపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో ప్రీమియం శ్రేణికి చెందిన ’రిజర్వ్‌’ కాఫీహౌస్‌ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా ఇది ఆరో రిజర్వ్‌ కాఫీహౌస్‌ కాగా, దక్షిణాదిలో మొట్టమొదటిదని సుశాంత్‌  వివరించారు. ఇది ఆగస్టు 1 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో ఇవి ఉన్నాయి.

టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ ఇటీవలి క్యూ1 నివేదిక ప్రకారం టాటా స్టార్‌బక్స్‌ ఆదాయం 11 శాతం వృద్ధి చెందిందని సుశాంత్‌ చెప్పారు. కంపెనీలో దేశీయంగా దాదాపు 4,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నట్లు వివరించారు. టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్, స్టార్‌బక్స్‌ కాఫీ కంపెనీకి చెరి సగం వాటాలతో జాయింట్‌ వెంచర్‌ సంస్థగా టాటా స్టార్‌బక్స్‌ కార్యకలాపాలు సాగిస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)