Breaking News

సంస్కరణలతో భారత్‌ వృద్ధికి దన్ను

Published on Sat, 12/17/2022 - 13:21

న్యూఢిల్లీ: రాబోయే కొన్ని దశాబ్దాల పాటు భారత్‌కు వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ధీమా వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సంస్కరణలు ఇందుకు ఊతంగా నిలవనున్నాయని ఆయన చెప్పారు. కరోనా మహమ్మారి ముందు, తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు 2047 నాటికి సాధించదల్చుకున్న లక్ష్యాలకు గట్టి పునాదిగా ఉండగలవని చంద్రశేఖరన్‌ చెప్పారు.

స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు అయ్యే నాటి కి భారత్‌ 25–30 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా ఆవిర్భవించగలదని ఆయన తెలిపారు. అయితే, అసంఘటిత రంగంలోని వర్కర్లు, వ్యవసాయ కార్మికులు, మహిళలు సహా ప్రజలందరికీ ఆ ఫలాలు దక్కేలా చూసుకోవడం చాలా ముఖ్యమని చంద్రశేఖరన్‌ పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా వివరించారు. మహమ్మారి సమయం నుంచి వ్యవస్థాగత సంస్కరణలు మరింతగా పుంజుకున్నాయని ఆయన చెప్పారు. 

Videos

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Bhogapuram: అభివృద్ధి సంకల్పం ఆ ఘనత జగన్ దే

చంద్రబాబు నివాసమున్న జిల్లాలోనే మహిళలపై పెరిగిన 11 శాతం నేరాలు

ఇంజనీరింగ్ నిపుణులే షాక్ అయ్యేలా అమరావతిలో భారీ దోపిడీ

AP: సైబర్ దొంగలు కోటి 23 లక్షలు కొట్టేశారు

Perni Nani: చిరంజీవి పెట్టిన బిక్ష

Photos

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)