Breaking News

టాటా రెడ్ డార్క్ ఎడిషన్స్.. అద్భుతమైన డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్

Published on Wed, 02/22/2023 - 20:03

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎట్టకేలకు నెక్సాన్, హారియర్, సఫారీ రెడ్ డార్క్ ఎడిషన్‌లను విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్స్ ఎక్కువ కాస్మెటిక్‌ అప్డేట్స్ మాత్రమే కాకుండా టెక్నాలజీ, సేఫ్టీ అప్‌గ్రేడ్స్ పొందుతాయి.

నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్:

దేశీయ మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న టాటా నెక్సాన్ ఇప్పుడు రెడ్ డార్క్ ఎడిషన్‌లో కూడా లభిస్తుంది. ఇది నాలుగు వేరియంట్స్‌లో లభిస్తుంది. అవి..

  • నెక్సాన్ ఎక్స్‌జెడ్ ప్లస్ రెడ్ డార్క్ పెట్రోల్ మాన్యువల్: రూ. 12.35 లక్షలు
  • నెక్సాన్ ఎక్స్‌జెడ్ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ మాన్యువల్: రూ. 13.70 లక్షలు
  • నెక్సాన్ ఎక్స్‌జెడ్ఏ ప్లస్ రెడ్ డార్క్ పెట్రోల్ ఆటోమాటిక్: రూ. 13.00 లక్షలు
  • నెక్సాన్ ఎక్స్‌జెడ్ఏ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ ఆటోమాటిక్: రూ. 14.35 లక్షలు

నెక్సాన్ రెడ్ డార్క్ ఎడిషన్ ఇప్పుడు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఇన్-బిల్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్‌లెస్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది.

టాటా హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్:

టాటా హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్ ఇప్పుడు ఎక్స్‌జెడ్ ప్లస్ రెడ్ డార్క్ డీజిల్ మాన్యువల్, నెక్సాన్ ఎక్స్‌జెడ్ ప్లస్ (ఓ) రెడ్ డార్క్ డీజిల్ ఆటోమాటిక్ వేరియంట్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ. 21.77 లక్షలు, రూ. 24.07 లక్షలు. ఈ కొత్త ఎడిషన్ లో ADAS టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది.

సఫారి రెడ్ డార్క్ ఎడిషన్:

ఈ ఎడిషన్ ఆరు వేరియంట్స్‌లో లభిస్తుంది. వీటి ధరలు రూ. 22.61 లక్షల నుంచి రూ. 25.01 లక్షల మధ్య ఉన్నాయి. సఫారి రెడ్ డార్క్ ఎడిషన్ కూడా ADAS ఫీచర్స్‌తో పాటు వెంటిలేటెడ్ సీట్లు, డోర్ హ్యాండిల్స్ దగ్గర, పనోరమిక్ సన్‌రూఫ్ చుట్టూ రెడ్ యాంబియంట్ లైటింగ్ పొందుతుంది.

టాటా రెడ్ డార్క్ ఎడిషన్‌లలో ఎటువంటి ఇంజిన్ అప్డేట్స్ లేదు, కావున పర్ఫామెన్స్ విషయంలో ఎటువంటి మార్పులు ఉండదు. 2023 ఆటో ఎక్స్‌పో వేదిక మీద సఫారి మరియు హారియర్ రెడ్ డార్క్ ఎడిషన్‌లు మాత్రమే కనిపించాయి, అయితే కంపెనీ ఇప్పుడు నెక్సాన్‌ని కూడా ఈ జాబితాలోకి చేర్చింది. రెడ్ డార్క్ ఎడిషన్‌ కొనుగోలుపైన 3 సంవత్సరాల/1,00,000కిమీ వారంటీ పొందవచ్చు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)