Breaking News

టాటా మోటార్స్‌ నుంచి మినీ ట్రక్‌లు.. ధర ఎంతంటే..

Published on Tue, 07/08/2025 - 12:53

వాహనాల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తాజాగా కార్గో రవాణా కోసం ఏస్‌ ప్రో పేరిట 4–వీల్‌ మినీ ట్రక్కులను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 3.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు 750 కేజీల పేలోడ్‌ సామర్థ్యంతో, పెట్రోల్, బై–ఫ్యుయెల్, ఎలక్ట్రిక్‌ వేరియంట్లలో ఈ వాహనాలు లభిస్తాయని సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ పినాకి హల్దార్‌ తెలిపారు. ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ ఒకసారి చార్జ్‌ చేస్తే సుమారు 125 కి.మీ. నుంచి 155 కి.మీ. వరకు మైలేజి ఇస్తుందని పేర్కొన్నారు. మారుతున్న మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో తేలికపాటి వాణిజ్య వాహనాల పరిశ్రమ వృద్ధి ప్రస్తుతం ఒక మోస్తరుగానే ఉన్నప్పటికీ మధ్యకాలికం, దీర్ఘకాలికంగా మెరుగ్గా ఉంటుందని హల్దార్‌ చెప్పారు.


క్యూ1లో జేఎల్‌ఆర్‌ అమ్మకాలు డౌన్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ (జేఎల్‌ఆర్‌) హోల్‌సేల్, రిటైల్‌ అమ్మకాలు తగ్గాయి. డీలర్లకు సరఫరా (టోకు విక్రయాలు) వార్షికంగా 11 శాతం క్షీణించి 87,286 యూనిట్లకు పరిమితమయ్యాయి. తొలి త్రైమాసికంలో ఉత్తర అమెరికా, యూరప్, బ్రిటన్‌లో హోల్‌సేల్‌ అమ్మకాలు వరుసగా 12 శాతం, 14 శాతం, 25 శాతం తగ్గినట్లు జేఎల్‌ఆర్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి: రూ.100తో చోటాసిప్‌!

ఇక రిటైల్‌ అమ్మకాలు 15 శాతం క్షీణించి 94,420 యూనిట్లుగా నమోదైనట్లు వివరించింది. సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్న తరుణంలో అంచనాలకు అనుగుణంగానే అమ్మకాలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. వారసత్వంగా వస్తున్న మోడల్స్‌ను క్రమంగా నిలిపివేసి కొత్త జాగ్వార్‌ మోడల్‌సను ప్రవేశపెట్టనుండటం, అమెరికాలో దిగుమతి సుంకాల వ్యవహారం కారణగా ఏప్రిల్‌లో ఎగుమతులు తాత్కాలికంగా నిలిచిపోవడం తదితర అంశాలు విక్రయాలు తగ్గడానికి కారణమని వివరించింది.
 

#

Tags : 1

Videos

Anil Kumar: మేము CCTV ఫ్యూటేజీతో కేసు పెట్టి వారం రోజులు అయింది..

ఉప్పాల హారికపై జరిగిన దాడిని ఖండించిన బీసీ నేత మారేష్

గుంటూరు ఎస్పీ ఆఫీస్ వద్ద YSRCP నేతల ధర్నా

సుప్రీం కోర్టు చేసిన సూచనలను EC పరిగణనలోకి తీసుకోవాలి: రాఘవులు

కూటమి పాలనలో ప్రభుత్వ యంత్రాంగాన్ని నిర్వీర్యం చేశారు: సజ్జల

తిరుపతి రైలులో అగ్ని ప్రమాదం ఎలా జరిగిందంటే

కేసులు పెట్టుకోండి.. కోర్ట్లో తేల్చుకుంటాం

పాలేరు, నాగార్జున సాగర్ ఆయకట్టుకు సాగునీరు విడుదల

Kuppam: గంగమ్మ అనే మహిళను కరెంట్ స్తంభానికి కట్టేసి కొట్టిన మంజునాథ్

తిరుపతిలో రైలు ప్రమాదం

Photos

+5

తిరుపతిలో రైలు అగ్నిప్రమాదం (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)

+5

నటుడు అర్జున్ పెళ్లిలో హీరో జయం రవి డ్యాన్స్ (ఫొటోలు)

+5

'మోనికా' పాటతో ట్రెండింగ్‍‌లో పూజా హెగ్డే (ఫొటోలు)

+5

ఏడేళ్ల వివాహ బంధానికి, 20 ఏళ్ల స్నేహానికి ముగింపు.. సైనా, కశ్యప్‌ జంట విడాకులు (ఫొటోలు)

+5

బంజారాహిల్స్ : 'ట్రాషిక్' ఫ్యాషన్ షో అదుర్స్ (ఫొటోలు)

+5

విశాఖపట్నం సాగరతీరంలో సండే సందడి (ఫొటోలు)

+5

Ujjaini Mahankali Bonalu: ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 13-20)

+5

కోట శ్రీనివాసరావు మృతి.. నివాళులు అర్పించిన ప్రముఖులు (ఫోటోలు)