Breaking News

మెప్పించని టాటా మోటార్స్‌

Published on Wed, 05/14/2025 - 08:15

ఆటో రంగ టాటా గ్రూప్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 51 శాతం క్షీణించి రూ. 8,556 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ.17,528 కోట్లు ఆర్జించింది. కంపెనీ బోర్డు వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 6 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది.

కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,19,033 కోట్ల నుంచి రూ. 1,19,503 కోట్లకు స్వల్పంగా బలపడింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 28,149 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఆర్జించింది. 2023–24లో రూ. 31,807 కోట్ల లాభం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 4,34,016 కోట్ల నుంచి రూ. 4,39,695 కోట్లకు ఎగసింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఆటోమోటివ్‌ బిజినెస్‌ ప్రస్తుతం రుణరహితంగా మారినట్లు కంపెనీ సీఎఫ్‌వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. కంపెనీ విడదీతకు వాటాదారులు ఆమోదముద్ర వేసినట్లు వెల్లడించారు.  

ఇదీ చదవండి: ఐబీఎం హెచ్‌ఆర్‌లో ఏఐ!

జేఎల్‌ఆర్‌  ఓకే

క్యూ4లో లగ్జరీ కార్ల బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్‌) ఆదాయం 2 శాతం నీరసించి 7.7 బిలియన్‌ పౌండ్లను తాకినట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది.  పూర్తి ఏడాదికి దాదాపు యథాతథంగా 29 బిలియన్‌ పౌండ్ల టర్నోవర్‌ సాధించినట్లు తెలియజేసింది. యూఎస్, యూకే మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య డీల్‌ జేఎల్‌ఆర్‌కు సానుకూలమని పేర్కొంది. ఐదేళ్ల కాలంలో 18 బిలియన్‌ పౌండ్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు తెలియజేసింది.  కాగా.. క్యూ4లో టాటా మోటార్స్‌ స్టాండెలోన్‌ నికర లాభం 35 శాతం క్షీణించి రూ. 1,382 కోట్లకు పరిమితంకాగా.. మొత్తం ఆదాయం రూ. 20,260 కోట్ల నుంచి రూ. 19,999 కోట్లకు స్వల్పంగా నీరసించింది.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)