Breaking News

టాటా మోటార్స్‌ లాభాలు అదుర్స్‌.. ఎన్ని వేల కోట్లంటే?

Published on Sat, 02/03/2024 - 08:01

న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌ (క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 133 శాతం దూసుకెళ్లి రూ. 7,100 కోట్లను తాకింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 3,043 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 25 శాతం ఎగసి రూ. 1,10,600 కోట్లకు చేరింది. ఆటో విభాగంలోనూ మూడు రకాల బిజినెస్‌లూ సానుకూల పనితీరును చూపినట్లు టాటా మోటార్స్‌ పేర్కొంది.

సీజనాలిటీ నేపథ్యంలో ఈ ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లోనూ మరింత మెరుగైన ఫలితాలను సాధించే వీలున్నట్లు అంచనా వేసింది. ఇందుకు కొత్త ప్రొడక్టుల విడుదల, మెరుగైన సరఫరాలు తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. వాణిజ్య వాహన(సీవీ) ఆదాయం 19 శాతం వృద్ధితో రూ. 20,100 కోట్లను తాకింది. దేశీ సీవీ విక్రయాలు 1 శాతం వృద్ధితో 91,900 యూనిట్లకు చేరగా.. ఎగుమతులు 14 శాతం ఎగసి 4,800 యూనిట్లుగా నమోదయ్యాయి.

ప్రయాణికుల వాహన అమ్మకాలు 5 శాతం పుంజుకుని 1,38,600 యూనిట్లకు చేరాయి. ఆదాయం 11 శాతం అధికమై రూ. 12,900 కోట్లను తాకింది. బ్రిటిష్‌ అనుబంధ కంపెనీ జేఎల్‌ఆర్‌ ఆదాయం 22 శాతం జంప్‌చేసి 7.4 బిలియన్‌ పౌండ్లకు చేరింది. 

తగ్గిన రుణ భారం 
ప్రస్తుత సమీక్షా కాలంలో కంపెనీ నికర రుణ భారాన్ని రూ. 9,500 కోట్లమేర తగ్గించుకోవడంతో రూ. 29,200 కోట్లకు చేరుకున్నట్లు టాటా మోటార్స్‌ వెల్లడించింది. నిర్వహణ లాభ(ఇబిట్‌) మార్జిన్లు రెట్టింపునకుపైగా బలపడి 8.8 శాతాన్ని తాకినట్లు వెల్లడించింది. ప్రణాళికలకు అనుగుణంగా రుణ తగ్గింపు లక్ష్యాన్ని సాధించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

విభిన్న వ్యూహాల ఆధారంగా చేపడుతున్న బిజినెస్‌ నిర్వహణ సంతృప్తికర ఫలితాలను చూపుతున్నట్లు టాటా మోటార్స్‌ గ్రూప్‌ సీఎఫ్‌వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. పూర్తి ఏడాదిని పటిష్ట పనితీరుతో ముగించనున్నట్లు అభిప్రాయపడ్డారు. రానున్న త్రైమాసికాలలోనూ రుణ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు.. మెరుగైన ఫలితాలను కొనసాగించగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఫలితాల నేపథ్యంలో టాటా మోటార్స్‌ షేరు బీఎస్‌ఈలో యథాతథంగా రూ. 879 వద్దే ముగిసింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)