టాటా కారు కొనుగోలుదారులకు షాక్‌!

Published on Fri, 06/12/2026 - 17:05

దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటర్స్‌ (Tata Motors) మరోసారి కారు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. కంపెనీ తన ప్యాసింజర్ వాహనాల శ్రేణిలోని పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల ధరలను జూలై 1, 2026 నుంచి గరిష్ఠంగా 1.5 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు భిన్నంగా ఉండనుంది. కొత్త ధరల జాబితాను జూలై 1న వెల్లడించనున్నారు.

ముడి పదార్థాల ధరలు పెరగడం, తయారీ వ్యయాలు అధికమవడం, కొనసాగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా కంపెనీ తెలిపింది. ఖర్చుల భారాన్ని ఇప్పటివరకు గణనీయంగా సంస్థే భరించినప్పటికీ, దాని ప్రభావంలో కొంత భాగాన్ని ఇప్పుడు వినియోగదారులకు బదిలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని టాటా మోటార్స్ పేర్కొంది.

ఈ ధరల పెంపు టాటా ప్యాసింజర్ వాహనాల మొత్తం శ్రేణిపై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో టాటా టియాగో (Tata Tiago), టాటా టైగర్‌, టాటా పంచ్‌ (Tata Punch), టాటా నెక్సాన్‌, టాటా కర్వ్‌ (Tata Curvv), టాటా హారియర్‌, టాటా సఫారీ వంటి మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్లు కూడా ఉన్నాయి. ఇటీవల పరిచయమైన టాటా సియెర్రా (Tata Sierra), సియెర్రా ఈవీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

టాటా మోటార్స్ ఈ ఏడాదిలో చేపడుతున్న రెండో ధరల పెంపు ఇది. అంతకుముందు ఏప్రిల్ 1 నుంచే కొన్ని వాహనాల ధరలను సంస్థ పెంచింది. మరోవైపు కమర్షియల్ వాహనాల ధరలను కూడా ఏప్రిల్‌లో 1.5 శాతం వరకు  టాటా మోటర్స్‌ పెంచింది.

ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న వ్యయాల ప్రభావంతో ఇతర కంపెనీలు కూడా ధరల సవరణలు చేపడుతున్నాయి. మారుతీ సుజుకీ (Maruti Suzuki) జూన్ 1 నుంచి కొన్ని మోడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచగా, హ్యుందాయ్‌ మోటర్స్‌ ఇండియా (Hyundai) కూడా జూన్ నుంచి ధరలను పెంచింది. దీంతో కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది.

జూలై 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానుండటంతో, టాటా కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు జూన్ నెలాఖరు లోపు బుకింగ్ లేదా కొనుగోలు పూర్తి చేస్తే ప్రస్తుత ధరల ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం కంపెనీ జూన్ నెలలో కొన్ని మోడళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు కూడా అందిస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)