Breaking News

మార్కెట్‌లోకి కొత్త వాహనాలు.. ప్రత్యేకతలివే..

Published on Thu, 12/07/2023 - 11:41

సరకు రవాణా అవసరాలు తీర్చేందుకు టాటా మోటార్స్‌ కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు, నిర్వహణ వ్యయాలను తగ్గించే ఉద్దేశంతో కొత్త తేలికపాటి వాణిజ్య వాహనాలను టాటా మోటార్స్‌ ఆవిష్కరించింది. ఇంట్రా వీ70, ఇంట్రా వీ20 గోల్డ్, ఏస్ హెచ్‌టీ+, ఇంట్రా వీ50 పేర్లతో వాటిని విపణిలోకి తీసుకొచ్చింది.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు సరుకు రవాణాతో అధిక లాభాలు సంపాదించేందుకు వీటిని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కస్టమర్‌ల అవసరాలకు అనుకూలమైన వాహనాన్ని ఎంచుకునేలా వీటిని తయారుచేసినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ డీలర్‌షిప్‌ల్లో ఈ వాహనాల బుకింగ్‌లు ప్రారంభమయినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడారు. ‘టాటా మోటార్స్‌ చిన్న వాణిజ్య వాహనాలు కస్టమర్ల జీవనోపాధిని మెరుగుపరుస్తున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన వాహనాలతో వినియోగదారులకు మరింత సేవలందించేలా కంపెనీ కృషిచేస్తోంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచి, అధిక పేలోడ్‌లను మోస్తూ ఎక్కువ దూరం వెళ్లేలా వీటిని రూపొందించాం. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-కామర్స్, లాజిస్టిక్స్‌, సరకు రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడుతాయి’ అని అన్నారు.

ఇదీ చదవండి: రామమందిర ప్రతిష్ఠాపనకు డేట్‌ ఫిక్స్‌.. ప్రముఖులకు ఆహ్వానం

ఇంట్రా వీ70 పేలోడ్ సామర్థ్యం 1700కేజీలు. ఫ్లీట్ ఎడ్జ్ టెలిమాటిక్స్ సిస్టమ్‌తో 9.7 అడుగుల పొడవైన లోడ్ బాడీతో దీన్ని తయారుచేసినట్లు అధికారులు తెలిపారు. ఇంట్రా వీ20 గోల్డ్ 800 కిమీల డ్యుయల్‌ ఇంజిన్‌ పికప్ సామర్థ్యంతో 1200 కేజీ పేలోడ్‌ను మోసుకెళ్తుందని కంపెనీ చెప్పింది. ఏస్‌ హెచ్‌టీ+ 900 కేజీ పేలోడ్‌ కెపాసిటీతో 800సీసీ డీజిల్‌ ఇంజిన్‌ కలిగి ఉందని అధికారులు పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)