Breaking News

టాటా కొత్త ఈవీ తయారీ ప్రారంభం.. ధర ఎంతంటే..

Published on Sat, 07/05/2025 - 20:00

టాటా మోటార్స్ అధికారికంగా ‘హారియర్.ఈవీ’ ఉత్పత్తిని ప్రారంభించినట్లు తెలిపింది. కంపెనీ తన పుణె ప్లాంటులో ఈమేరకు ప్రొడక్షన్‌ను మొదలు పెట్టినట్లు పేర్కొంది. హారియర్.ఈవీ డెలివరీలు 2025 జులైలోనే ప్రారంభం కానున్నాయి. దాంతో కంపెనీ ఈమేరకు తయారీని మొదలుపెట్టినట్లు స్పష్టం చేసింది.

జూన్ 27న ఈ హారియర్‌.ఈవీ వేరియండ్‌ ధరలు ప్రకటించిన తరువాత వీటి కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. జులై 2న అధికారికంగా ఈ కార్ల బుకింగ్‌లు స్వీకరించింది. ఇప్పటికే భద్రత పట్ల దాని నిబద్ధతను చూపుతూ హారియర్.ఈవీ భారత్ ఎన్‌సీఏపీ 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. వయోజనుల భద్రతతో 32/32, పిల్లల రక్షణకు 45/49 మార్కును సాధించింది. ఈ విభాగంలో అత్యధిక భద్రతా స్కోర్లలో ఇది ఒకటి.

ఇదీ చదవండి: త్వరలో 50 శాతం వైట్‌కాలర్‌ జాబ్స్‌ కనుమరుగు

హారియర్.ఈవీ వివిధ కాన్ఫిగరేషన్లలో లభిస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో రెండు బ్యాటరీ 65 కిలోవాట్, 75 కిలోవాట్ వేరియంట్‌లు ఉన్నాయి. రెండింటిలోనూ డిఫాల్ట్‌గా రియర్ వీల్ డ్రైవ్ (ఆర్‌డబ్ల్యూడీ) సింగిల్ మోటార్ సెటప్ ఉంది. అయితే 75 కిలోవాట్ వేరియంట్ మెరుగైన పనితీరు కోసం ఆల్ వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యుడీ) డ్యూయల్ మోటార్ కాన్ఫిగరేషన్‌ అందిస్తున్నట్లు పేర్కొంది. వేరియంట్‌ను అనుసరించి ఈ ఈవీ ధర రూ.21.49 లక్షలు(ఎక్స్‌షోరూమ్‌) నుంచి రూ.28.99 లక్షలు వరకు ఉంది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)