Breaking News

ఐఫోన్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత

Published on Mon, 09/30/2024 - 18:44

తమిళనాడులోని హొసూరు వద్ద యాపిల్ ఐఫోన్ భాగాలను తయారు చేసే  టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిరవధికంగా నిలిచిపోయింది. రెండు రోజుల క్రితం ఇక్కడ అగ్నిప్రమాదం జరిగింది. దీని తర్వాత మరింత నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి ఇప్పుడప్పుడే కొనసాగే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది.

ప్రమాదం సమయంలో పడిపోయిన షెడ్‌లను తొలగిస్తున్నప్పుడు మళ్లీ అగ్ని ప్రమాదం లేదా పొగ వచ్చే అవకాశాలు ఉన్నందున ప్లాంట్‌లో ఫైరింజన్‌లను అందుబాటులో ఉంచినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.వేలు రాయిటర్స్‌తో అన్నారు. అగ్నిప్రమాదానికి కారణాన్ని ఇంకా నిర్ధారించలేదని చెప్పారు.

ప్లాంట్‌లో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. 10 మంది స్వల్పంగా గాయపడ్డారు. దీంతో ఉత్పత్తిని నిలిపివేశారు. యాపిల్‌ చైనాను దాటి భారత్‌ను కీలక వృద్ధి మార్కెట్‌గా చూస్తున్న నేపథ్యంలో ఐఫోన్‌ సరఫరా గొలుసును ప్రభావితం చేసే తాజా సంఘటన ఇది. ఈ సంఘటనపై యాపిల్ వ్యాఖ్యానించలేదు. మరోవైపు టాటా మాత్రం అగ్నిప్రమాదానికి కారణం ఏంటన్నదానిపై దర్యాప్తు జరుగుతోందని, ప్లాంట్‌లోని ఉద్యోగులు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించింది.

ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త టెక్నాలజీ..

ఈ ప్లాంట్‌లో ఐఫోన్‌లకు క్లిష్టమైన బ్యాక్ ప్యానెల్‌లతోపాటు కొన్ని ఇతర భాగాలను తయారు చేస్తారు. ఇదే కాంప్లెక్స్‌లోని మరో భవనంలో ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ ఈ ఏడాది చివర్లో ప్రారంభించాల్సి ఉంది. అయితే అగ్ని ప్రమాద ప్రభావం దీనిపై ఎంత మేరకు పడిందో స్పష్టంగా తెలియలేదు.
 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)