Breaking News

టెస్లా కార్లకు సప్లయర్‌ ‘టాటా’నే!

Published on Fri, 03/21/2025 - 17:53

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) కంపెనీ టెస్లాకు గ్లోబల్ సప్లయర్‌గా టాటా గ్రూప్ నిలిచింది. ఈమేరకు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ భాగస్వామ్యం ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెరుగుతున్న భారత్‌ పాత్రను, అధునాతన తయారీ, సాంకేతికతలో టాటా గ్రూప్ నైపుణ్యాన్ని నొక్కి చెబుతోంది.

ఈ నివేదిక ప్రకారం.. టాటా ఆటోకాంప్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), టాటా టెక్నాలజీస్ , టాటా ఎలక్ట్రానిక్స్‌తో సహా అనేక టాటా గ్రూప్‌ కంపెనీలు ఇప్పుడు టెస్లా సరఫరా గొలుసులో భాగంగా ఉన్నాయి. కీలకమైన భాగాలు, సేవలను అందిస్తున్నాయి. ఈ టాటా సంస్థలు ఇప్పటికే టెస్లాతో అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, వివిధ విడిభాగాలు, సేవలను సరఫరా చేస్తున్నాయని ఈటీ నివేదించింది. ముఖ్యంగా టెస్లా భారత్‌లో తయారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తే వారి భాగస్వామ్యం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.

టెస్లా సీనియర్ ప్రొక్యూర్మెంట్ అధికారులు నిర్దిష్ట విడిభాగాల తయారీ గురించి భారతీయ సరఫరాదారులతో చర్చలు జరుపుతున్నారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఈటీ పేర్కొంది. వీటిలో కాస్టింగ్స్, ఫోర్జింగ్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాబ్రికేషన్ భాగాలు ఉన్నాయి. టెస్లాకు భారతీయ సప్లయర్ల సహకారం ఇప్పటికే గణనీయంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కంపెనీలు టెస్లాకు దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాలను సరఫరా చేశాయి. టెస్లా తన సరఫరా గొలుసును వైవిధ్యపరచాలని చూస్తున్న క్రమంలో భారత్‌ నుంచి దాని సోర్సింగ్ పెరుగుతుందని భావిస్తున్నారు.

టాటా కంపెనీలు ఏం సరఫరా చేస్తున్నాయంటే..
ఈటీ కథనం ప్రకారం.. వివిధ టాటా గ్రూప్ కంపెనీలు టెస్లాకు ప్రత్యేక ఉత్పత్తులు, సేవలను అందిస్తున్నాయి. వాటిలో టాటా ఆటోకాంప్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఇంజనీరింగ్ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. టాటా టెక్నాలజీస్ ఎండ్-టు-ఎండ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ అందిస్తోంది. టీసీఎస్ సర్క్యూట్ బోర్డు టెక్నాలజీని అందిస్తోంది.

టెస్లా తయారీ యూనిట్‌ ఇ‍క్కడ ఏర్పాటయ్యాక టాటా ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ చిప్‌లను సరఫరా చేస్తుందని భావిస్తున్నారు. ఇక బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్, మోటార్ కంట్రోలర్ యూనిట్లు, డోర్ కంట్రోల్ మెకానిజమ్‌కు కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లింగ్స్ (పీసీబీఏ) కోసం టెస్లా టాటా ఎలక్ట్రానిక్స్ వైపు చూడవచ్చు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)