Breaking News

జాబ్‌ లేదా? ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు!

Published on Tue, 10/15/2024 - 13:08

టాటా గ్రూప్‌ వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ను తెలిపారు. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు..వంటి వివిధ తయారీ విభాగాల్లో ఉద్యోగార్థులకు అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్’ అనే అంశంపై చర్చ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న భారత్ లక్ష్యానికి తయారీ రంగం కీలకంగా మారుతుంది. ఈ రంగంలో రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో ఉద్యోగుల అవసరం ఉంది. ఉత్పాదక రంగంలో ఉద్యోగాలు కల్పించలేకపోతే కేంద్ర ప్రభుత్వం తలంచిన వికసిత్‌ భారత్ లక్ష్యాలను చేరుకోలేము. తయారీ రంగం వృద్ధి దిశగా టాటా గ్రూప్‌ సంస్థలు వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెంచుతోంది. సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు..వంటి వివిధ రంగాల్లో విభిన్న పరికరాలను తయారు చేసేలా టాటా గ్రూప్‌ చర్యలు చేపడుతోంది. అందుకోసం రాబోయే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం’ అని చెప్పారు.

ఇదీ చదవండి: గూగుల్‌ న్యూక్లియర్‌ పవర్‌ కొనుగోలు

టాటా గ్రూప్ అస్సాంలో కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేస్తోంది. ఇందులో సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ యూనిట్లు ఉన్నాయి. తయారీ రంగం వృద్ధి చెందితే దేశ దిగుమతులు తగ్గుతాయి. అందుకు అనుగుణంగా ఎగుమతులు అధికమవుతాయి. ఫలితంగా రూపాయి విలువ పెరుగుతుంది. దాంతోపాటు ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గుతుంది. దేశంలోని చాలా కంపెనీలు ఇప్పటికే లేఆఫ్స్‌ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. దానికి బదులుగా ఉత్పాదకతను పెంచి ఎగుమతులను మెరుగుపరిస్తే ఆర్థిక వ్యవస్థలకు మేలు జరుగుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఉద్యోగార్థులు కంపెనీలు ఆశించే నైపుణ్యాలు పెంచుకోవాలని సూచిస్తున్నారు.

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)