Breaking News

టాటా కర్వ్‌ ఈవీ కొత్త మోడల్ లాంచ్

Published on Tue, 05/05/2026 - 09:12

టాటా మోటార్స్‌ తన ఎలక్ట్రిక్‌ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ, తన కర్వ్‌ ఈవీలో సరికొత్తగా ‘సిరీస్‌ ఎక్స్‌’ శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్‌ ప్రారంభ ధరను రూ.16.99 లక్షలుగా (ఎక్స్‌ షోరూమ్‌ వద్ద) కంపెనీ నిర్ణయించింది.

ఈ సిరీస్‌లో అకంప్లిష్డ్‌ ఎక్స్‌ 55, ఎంపవర్డ్‌ ఎక్స్‌ 55 అనే రెండు వేరియంట్లను పరిచయం చేసింది. వీటిలోని 55 కిలోవాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఏకంగా 502 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. రియల్‌ వరల్డ్‌ కండిషన్స్‌ లో ఈ బ్యాటరీ సుమారు 400 కిలోమీటర్ల వరకు రేంజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

లెవెల్‌-2 ఏడీఏఎస్, 360-డిగ్రీ కెమెరా, పానోరామిక్‌ సన్‌రూఫ్, హర్మాన్‌ సినిమాటిక్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి. వినియోగదారుల నమ్మకాన్ని పెంచేందుకు బ్యాటరీపై 15 ఏళ్ల (లైఫ్‌–టైమ్‌) హెచ్‌వీ బ్యాటరీ వారంటీని టాటా మోటార్స్‌ అందిస్తోంది.

మిడ్‌-ఎస్‌యూవీ విభాగంలో ఎలక్ట్రిక్‌ మొబిలిటీని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ‘సిరీస్‌ ఎక్స్‌’ శ్రేణి విడుదల చేసినట్లు టాటా ప్యాసింజర్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ సీసీఓ వివేక్‌ శ్రీవత్స తెలిపారు. ఈ కారు ఐదు ఆకర్షణీయమైన రంగులతో పాటు ఐకానిక్‌ ‘డార్క్‌’ ఎడిషన్‌లోనూ లభించనుంది.  

Videos

ఫ్యామిలీతో విజయ్ సెలబ్రేషన్స్

ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం..

DMK, AIADMK పట్టిన గతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు

గెలిచిన చోట విజయ్ రాజీనామా..

తమిళ రాజకీయాల్లో కొత్త శక్తి..!

10 సీట్లు కోసం.. ఆ పార్టీతో TVK పొత్తు..?

CM పదవికి స్టాలిన్ రాజీనామా.. గవర్నర్ కు లేఖ

విజయ్ పై తల్లి, ఫ్యామిలీ అద్భుతమైన పాట

రానున్న 24 గంటల్లో హర్మూజ్ జలసంధిలో ఏం జరగబోతోంది

ఆ దమ్ము.. ఆ ఫైర్, పవన్ లో ఎందుకు లేదు..

Photos

+5

సెల్ఫీ విత్‌ సీఎం విజయ్‌.. సోషల్‌ మీడియా షేక్‌ (ఫొటోలు)

+5

సొట్టబుగ్గల మెగాకోడలు లావణ్య చాన్నాళ్లకు ఇలా (ఫొటోలు)

+5

కోనసీమ జిల్లా : అరటి తోటల మధ్య అందమైన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తమిళులు మెచ్చిన దళపతి.. నేడు ఎమ్మెల్యే విజయ్‌.. రేపు..? (ఫొటోలు)

+5

#MetGala2026 : మెట్ గాలా 2026 ఈవెంట్‌లో ఇషా అంబానీ (ఫోటోలు)

+5

ప్రముఖ నిర్మాత వీఆర్‌కే రావు మనవరాలి వివాహం (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్ వేకేషన్‌లో పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్‌ (ఫొటోలు)

+5

కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ పోజులు (ఫొటోలు)

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)